ఐరాస దౌత్య విజయం తరువాత ఇండియాకు ప్రపంచదేశాల్లో గౌరవం పెరిగింది.  గత ఐదేళ్ళలో ఇండియాపై గౌరవం పెరిగిందని  తద్వారా ప్రపంచదేశాలు ఇండియాను గౌరవిస్తున్నామని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటె, మోడీ అమెరికా పర్యటన సమయంలో మోడీతో కలిసి హ్యూస్టన్ లో పాల్గొన్నారు. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి.  ఇండియా.. అమెరికా మధ్య సంబంధాలు బలపడటంతో చైనాకు, పాక్ కు విపరీతంగా కసి పెరిగింది.  


అంతేకాదు, మోడీ చేసిన ప్రసంగం సైతం అందరిని ఆకట్టుకుంది.  ఐరాసలో పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన ప్రసంగంతో ప్రపంచదేశాలు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చాయి.  ఇది పాక్ కు మింగుడు పడలేదు.  చైనాకు సైతం ఇది కాస్త ఇబ్బంది కలిగించింది. కానీ, ఇండియా అవేమి పట్టించుకోకుండా అనుకున్న పనిని అనుకున్నట్టుగా చేసుకుంటూ పరుగులు తీస్తున్నది.  


ఇదిలా ఉంటె, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అక్టోబర్ 11, 12 వ తేదీన ఇండియాలో పర్యటించబోతున్నారు.  జిన్ పింగ్, మోడీలు మహాబలిపురంలో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యానికి సంబంధించిన విషయాలు, బోర్డర్ సమస్యలు, రెండు దేశాల దౌత్యపరమైన విషయాల గురించి చర్చకు రాబోతున్నది.  రెండు దేశాల మధ్య వీటితో పాటుగా మరిన్ని విషయాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.  


దానికంటే ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా వెళ్తున్నారు.  ఇమ్రాన్ ఖాన్ చైనా వెళ్లడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అన్నది తెలియడం లేదు.  తాజా సమాచారం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ చైనా వెళ్లడం వెనుక పెట్టుబడులు, వాణిజ్యం వంటి విషయాలు ఉన్నాయని తెలుస్తోంది.  పాక్ దగ్గర డబ్బులేక తెగ ఇబ్బంది పడుతున్నది.  పాక్ లో ఉగ్రవాదం ఉగ్రవాదులు ఉండటంతో ప్రపంచ దేశాలు చేసే సహాయం చాలా తక్కువగా ఉంటోంది.  దీంతో చైనా నుంచి సహాయం కోరేందుకు పాక్ ప్రధాని చైనాకు వెళ్ళబోతున్నారు. అయితే పాక్ ప్రధాని కాశ్మీర్ అంశానని కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: