గాంధీజీ 150 వ జయంతి సందర్భంగా దేశంలో అనేక కార్యక్రమాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది.  కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేది పధకాలు తీసుకొచ్చింది.  తాజాగా పర్యావరణ పరిరక్షణే ప్రధానంగా మరికొన్ని కఠినమైన నియమాలను ముందుకు తీసుకురాబోతున్నది.  అందులో ప్రధానంగా కనిపిస్తున్న అంశం ప్లాస్టిక్ నిషేధం.  ప్లాస్టిక్ నిషేధం అనగానే అన్ని రకాల ప్లాస్టిక్ లను నిషేధిస్తున్నారు అనుంటేకుంటే పొరపాటే.  కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ప్రభుత్వం నిషేదించబోతున్నది. 

ఈ నిషేధంతో ఇండియాకే కాదు ప్రపంచదేశాలకు కూడా అద్భుత ప్రయోజనం కలగబోతున్నది.  గతంలో ప్రపంచం అంతం కావడానికి పర్యావరణం సమతుల్యత లోపించడమే కారణం అనే సంగతి అందరికి తెలిసిందే.  పర్యావరణాన్ని రక్షించుకోవాలి అనే తపనతో ఇప్పుడు అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.  దానికి ఇండియా నేతృత్వం వహించే విధంగా పధకాలు రూపొందిస్తోంది.  ప్లాస్టిక్ కు ఎక్కువగా వినియోగించే దేశాల్లో ఇండియా కూడా ఉన్నది.  


దీనికి ఇకపై చెక్ పెట్టాలని చూస్తున్నది.  అతి తక్కువ ధరకు మార్కెట్లో దొరుకుతుండడంతో ప్రతి ఒక్కరు దీనికి అలవాటు పడ్డారు.  ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన ఒక్క పర్యావరణానికే కాదు, ఇటు మనిషికి కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి.  ప్లాస్టిక్ వస్తువుల్లో ఉండే విషపూరితమైన మూలకాలు, వేడి వేడి వస్తువుల కారణంగా మెల్ట్ అవుతాయి.  ఫలితంగా ఆహరం విషతుల్యం అవుతుంది.  


ఈ విషయం తెలియక చాలామంది ఇలా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నారు.  ఇందులో మార్పు రావాలి.  మార్పు రావాలి అంటే తప్పనిసరిగా అన్ని రంగాల్లో మార్పులు తీసుకురావాలి.  అందుకోసమే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.  కొంత కఠిన వైఖరిని కూడా అవలంబించాలని కూడా చూస్తున్నది.  మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: