సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల నేపథ్యంలో ఈనెల 17 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ వాహవదారులను బెంబేలెత్తిస్తున్నాయి. దసరా పండగకు కనీసం ఆనందంగా గడపకుండా చేస్తున్నాయి.పెట్రోల్‌తో పాటుగా అన్ని నిత్యావసర ధరలు ప్రజలను కన్నీళ్లు పెట్తిస్తున్నాయి.మార్కెట్‌కు వెళ్లి ఏమైనా కొందామంటే జేబులు తడుముకునే పరిస్దితిలో సామాన్యుడు బ్రతుకుతున్నాడు.ఈ క్రమంలో వాహనదారులకు కొంచెం ఊరట లభించే విషయం ఏంటంటే పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదలకు స్వల్పంగా బ్రేకులు పడ్డాయి.వాటి పరుగులు నెమ్మదించాయి.



గత కొంత కాలంగా పెరుగుతూ వచ్చిన ధరలు గురువారం తగ్గాయి.పెట్రోల్ ధర 11 పైసలు, డీజిల్ ధర 7 పైసలు చొప్పున క్షీణించింది.దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 79.14కు చేరుకోగా,డీజిల్ ధర రూ.73.44కు దిగొచ్చింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి.ఇక అమరావతిలో కూడా పెట్రోల్,డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది.పెట్రోల్‌ ధర10 పైసలు తగ్గుదలతో రూ.78.80కు క్షీణించగా,డీజిల్‌ ధర కూడా 7 పైసలు క్షీణతతో రూ.72.76కు తగ్గింది.



ఇక విజయవాడలోనూ,పెట్రోల్ ధర 11 పైసలు తగ్గుదలతో రూ.78.43కు చేరగా.డీజిల్ ధర 7 పైసలు క్షీణతతో రూ.72.42కు తగ్గింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర 10 పైసలు తగ్గుదలతో రూ.74.51కు క్షీణించింది.డీజిల్ ధర కూడా 6 పైసలు క్షీణతతో రూ.67.43కు తగ్గింది.వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 10 పైసలు తగ్గుదలతో రూ.80.11కు క్షీణించింది.డీజిల్ ధర 7 పైసలు క్షీణతతో రూ.70.69కు తగ్గింది.ఏది ఏమైన ఒక పెట్రోల్ రేటు మాత్రం తగ్గిదే సామాన్యుడి భారం తగ్గదు.వీటితో పాటుగా కాస్త నిత్యావసరాల ధరలుకూడా దిగితే బాగుండునని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: