నారాయ‌ణ నారాయ‌ణ‌.. ఏందీ గిట్ల జేస్తివి నారాయ‌ణ‌.. నీపైన ఎంతో న‌మ్మ‌కం పెట్టుకుంటిమి.. మీకు ఇది ఓటు బ్యాంక్ ఉంట‌ద‌ని మేం ఎంతో సంబుర‌ప‌డితిమి.. కానీ చివ‌రాఖ‌రికి అభ్య‌ర్థిని పెట్ట‌కపోతివి.. స‌పోర్టు ఇయ్య‌క‌పోతివి.. గిట్ల జేసుడు నీకేమ‌న్నా ఇమ్మ‌త్ గా ఉందా నారాయ‌ణ‌... నీ జిమ్మ‌డ బోను.. నిన్ను తిట్టినోడితోనే సోప‌తి గ‌డితివి.. నిన్ను నానా యాత‌న బెట్టినోనితోనే అలాయ్ బ‌లాయ్ అంటుంటివి.. నీతో క‌లిసి న‌డిసిన మ‌మ్మ‌ల్ని న‌డిమిట్లేనే ఆగంజేసి పోతుంటువి.. ఇదేమి ధ‌ర్మం నారాయ‌ణ‌.. నిన్ను న‌మ్ముకుంటే..నన్ను న‌ట్టేట ముంచితివి గ‌దే నారాయ‌ణ‌.. కంకి కొడ‌వ‌లి అంటే క‌చ్చితంగా ఉంట‌ర‌నుకున్న‌.. కంకి కాకెత్తుక పాయే.. కొడ‌వ‌లి కేసీఆర్ ఎత్తుక‌పోయే.. నీవు ఇప్పుడు నీతి త‌ప్పితివి... నీ జాడ మ‌రిచితివి.. ఆఖ‌ట్ల‌.. నీ ఉనికే లేకుంట జేసుకుంటివి... ఏందే నారాయ‌ణ నువ్వు చేసిన ఈ ప‌ని ఏమైనా ఇంపుగా ఉందా.. జెర జెప్ప‌రాదే.. అంటూ గా చేతిగుర్తోల్లు గ‌బారా ప‌డుతుంటే..


అరే బై.. ఎందిరా మీ లొల్లి... మేము మాటంటే మాటే.. ఏదైనా ఒక్క‌సారి అనుకున్న‌మంటే.. గాదాన్ని గ‌ట్ల‌నే అమ‌లుజేత్తం.. అంతేకానీ ఒక్క‌టే లొల్లి జేస్తుండ్లు.. మేమేమ‌న్నా మీకు గులాంగిరి గిట్ల జెయ్యాల్నా.. మేము గీ తెలంగాణ‌లో మున్స‌బ్‌లం... మాకు హైద‌రాబాద్ న‌డిబొడ్డున ధ‌ర్నాలు జేసుకోనికి జాగ లేకుండే.. ధ‌ర్నా చౌక్ కోసం ఎన్నో పోరాటాలు జేసినం.. అక్క‌డ ధ‌ర్నాలు, గిర్నాలు జాన్తా నౌ అన్న‌డు గా కేసీఆర్ దొర‌.. అయినా మేము గ‌క్క‌డ ధ‌ర్నాలు జేసీనం.. గా దొర ఊకేనే ఊరుకుండా.. లొల్లి జేసిండు.. గా పోలీసుల‌ను బెట్టి మ‌క్కెలిగ త‌న్నిచ్చిండు.. బొక్క‌లిరిగేట‌ట్లు కొట్టిచ్చిండు.. ఇక మావ‌ల్ల కాలే.. ఎందుకు గీ దొర‌తోటి లొల్లి అనుకున్నం.. గా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి గిప్ప‌టిదాకా దొర‌ల‌తోని మాకు కొట్లాటేనా.. గందుకే గా దొర‌తోటి సోపతి గ‌డితే ఏమైనా లాభం ఉంట‌దా అని సొచాయించినం.


మాకు గిక్క‌డ  ధ‌ర్నాలు జేయ‌నీకి జెర జాగ ఇయ్య‌రాదే అంటే గా కేసీఆర్ దొర మాతో ఎన్న‌డైనా గ‌డ‌బిడ జేస్తిరో మీ పీక‌పిసుకుతా.. అన్న‌డ‌ట దొర‌.. ఇంకేముంది మీతో మాకు పంచాయితీ గించాయితీ ఏంలేదు.. ఎన్న‌డైన నీవు జెప్పిన‌ట్లే మీకు గులాంగిరి జేస్తమని మాటిచ్చినం.. దీంతో కేసీఆర్ దొర‌కు ఒంగొంగి దండం బెట్టంగ బెట్టంగ జాగిచ్చే.. గందుకే.. గిప్పుడు గా రుణం దీర్చుకోనికి మేము హుజూర్‌న‌గ‌ర్‌లో జారుకున్నం.. గందుకే గ‌దా.. మా ఎర్ర‌జెండా నుంచి ఒక్క‌ల్ని కూడా లంగోటా క‌ట్టుకోనియ్య‌కుండా కాప‌లాగాసినం.. గిప్పుడు మేము గా కేసీఆర్ దొర రుణం దీర్చుకోనికి ఎన్నిక‌ల్లో పోటీ జెయ్య‌కుండా.. గ‌ప్‌చిప్‌గా ఉన్నం.. గా దొర మాతో చాటుమాటుగా ఓ ముచ్చ‌ట జెప్పిండు.. గందుకే మూడురంగులు జెండాగాండ్ల‌కు హండిచ్చి.. కేసీఆర్ దొర‌తో సోప‌తిగ‌ట్టినం.. దీనికే మీరు ఒక్క‌టే గోల‌గోల జేత్తండ్లు.. అంటూ గా సీపీఐ నారాయ‌ణ కాంగ్రెసోల్ల‌కు కౌంట‌రిచ్చే.. మ‌రి గీ నారాయ‌ణ ఎప్పుడు ఎట్లుంట‌డో ఎవ్వ‌రికి అంతు చిక్క‌దు క‌దా..


అగో నారాయ‌ణ అనంగానే.. గాంధీ తాత పుట్టిన రోజు గుర్తుకొచ్చింది.. గ‌దే గా గాంధీ తాత పుట్టిన రోజున కోడికూర క‌డుపునిండా తిని కంగారు కంగారు పెట్టి ఏడాది కోడికూర తిన‌కుండా మూతికి కుట్లేసుకుండు.. ఆ గ‌దే  గుర్తుకొచ్చింది.. అయ్యో నారాయ‌ణ గా గాంధీ తాత పుట్టిన రోజు ఇయ్యాలా.. మ‌ల్లా కుతిగుంజితే.. మ‌ల్లా కోడికూర తినేవు.. ఆ అయినా నువ్వేమ‌న్నా మాట‌మీదుంటోనివా.. ఏమ‌న్ననా... నీ ప‌ని నీవు కానియ్యే.. అనేటోల్లు అంట‌నే ఉంట‌రు... నువ్వు చేసుకునేది చేసుకోవే... అయితే గాని ఎనుక‌టి ఓ మోటు సామెత ఉండే.. గుర్తుందా.. కులం చెడ్డా సుఖం ద‌క్కాల‌ని.. జెర పైల‌మే.. గా కేసీఆర్ దొర‌ను న‌మ్మితే న‌ట్టేట ముంచుత‌డ‌ని ఆ దొర‌తో సోప‌తి చేసినోల్లు అనంగా ఇన్న‌.. ఎందుకైనా మంచిది.. జెర పైలంగా ఉండే...


మరింత సమాచారం తెలుసుకోండి: