ఆంధ్ర ప్రదేశ్ ఒకేసారి లక్ష ఇరవై వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలను నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించి పది రోజుల్లోనే ఫలితాలు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారు. గ్రామ సచివాలయ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు మెరుగైన శిక్షణ అందించి ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికే సత్వర చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. అయితే దీనిపై ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయి. 

 

 

 

 

 ఏపీ సీఎం జగన్  గ్రామ సచివాలయ ఉద్యోగాలను అమ్ముకున్నారని... అందుకే గ్రామ సచివాలయ పరీక్షలకు సంబంధించి పేపర్ లీకేజ్ చేశారని ఆరోపించారు. ఈ గ్రామ వార్డు సచివాలయ పరీక్షల్లో  నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని కేవలం జగన్ కి  సన్నిహితులైన వారికి మాత్రమే న్యాయం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు మేలు  చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ చూసి ఓర్వలేక పోతుందని అందుకే అనవసర ఆరోపణలు చేస్తుందని వైసీపీ ప్రభుత్వం టిడిపి పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

 

 

 

 అయితే ఇదిలా ఉండగా గ్రామ వార్డు సచివాలయ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు అధికారులు ఝలక్ ఇస్తున్నారు. గ్రామ వార్డు  సచివాలయ పరీక్షలలో ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల పాటు ప్రొబేషనరీ తో పాటు మూడేళ్లపాటు తప్పకుండా పని చేయాలని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అలా పని చేయకుండా మధ్యలో ఉద్యోగం మానేస్తే ప్రభుత్వం వారికి ఇచ్చిన గౌరవ వేతనం తో పాటు వారి శిక్షణ కోసం ప్రభుత్వం  ఖర్చు చేసిన మొత్తం వ్యయాన్ని చెల్లించాలని ఎంపికైన అభ్యర్థులకు ఝలక్ ఇస్తున్నారు అధికారులు. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ లో ఇలాంటి నిబంధనలేవీ లేకపోయినప్పటికీ... ఇలాంటి కొత్త నిబంధనలు అధికారులు చెప్పడంతో ఎంపికైన అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: