జగన్ పార్టీలో అప్పుడే ముసలం మొదలైందా.. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే అవుననే అనిపిస్తుంది. ఈ విషయాన్నిరాజకీయ మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ ముందుగానే పసికట్టినట్టు ఉన్నాడు. సర్వసాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకైనా  సరే.. మంత్రివర్గ విస్తరణలో సమయంలో, నామినేటెడ్ పదవులు విషయంలో ఎంతమంది ఆశావహులు ఉన్నారో చూశాం. ఖచ్చితంగా పదవి దక్కని వారికి ఎంతోకొంత అసమ్మతి ఉంటుంది. కానీ ఇప్పుడే అది మొదలైందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నాయకుల మధ్య చాపకింద నీరుగా అసమ్మతి సెగ రగులుతోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.


ఇప్పటికే అధికార పార్టీ  వైసీపీలో నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి మొదలైనట్లు తెలుస్తుంది. ఇటీవలే మంత్రి అవంతి, వీఎమ్‌ఆర్డీ ఛైర్మన్ ద్రోణంరాజు మధ్య మాటల యుద్దం నడిచింది.   గాంధీ జయంతి రోజున మహాత్మడికి నివాళులు అర్పించిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అవుతున్నా.. ఇంకా వివక్షత కొనసాగుతోంది’ అంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. పైగా  లక్షలాది మంది ఓట్లు వేసి తనను గెలిపిస్తే.. పని చేసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.




దళితులంటే చిన్న చూపు చూస్తున్నారంటూ.. నాకు స్వేచ్ఛ లేదని బాబురావు వాపోవడం విశేషం. ఈ విషయాను ముందుగానే గ్రహించిన సీనియర్ నాయకులు  ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటివల జాగ్రత్త పడాలంటూ జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారనే చెప్పాలి.  జాగ్రత్తపడకపోతే లేకపోతే సొంత ఎమ్మేల్యేల నుంచి తిరుగుబాటు జరిగే ప్రమాదం ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉండటం, జగన్.. అవినీతికి ఆస్కారం ఇవ్వకపోడం, పని విషయంలో నిబ్ధతగా ఉండాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో..ముందు జాగ్రత్త హెచ్చరికగా ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: