జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా తప్పులు ఉన్నాయని...  ఆ తప్పులను  సరి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టులో వ్యయం  తగ్గించి ఆదాయాన్ని పొందేలా  జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ అనే నిర్ణయానికి  శ్రీకారం చుట్టింది. రివర్స్ టెండరింగ్ నిర్ణయం  జగన్ ప్రభుత్వం తీసుకోవడంతో ప్రతిపక్ష టీడీపీ నేతలందరూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

 

 

 

 

 ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి  అయిన పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేసి రివర్స్ టెండరింగ్ నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని... రివర్స్ టెండరింగ్ వల్ల  కోట్ల రూపాయలు నష్టం వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు సహా టిడిపి నేతలు అందరూ వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ ఆలోచన విజయవంతం అవుతుంది. రివర్స్ టెండరింగ్ వలన ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. 

 

 

 

 అయితే రివర్స్ టెండరింగ్ పై  ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు ఆపట్లేదు.  ఈ నేపథ్యంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు  చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల 7,500 కోట్ల రూపాయల నష్టం వస్తుందని చంద్రబాబు కాకి లెక్కలు చెబుతున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. మీరు పాలించిన ఐదేళ్లలో ఐదు లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల 7,500 కోట్ల నష్టం వస్తుందని చెబుతున్న చంద్రబాబు చెబుతున్నారని ... కానీ  వ్యవసాయ రంగం లక్ష కోట్ల ఉత్పత్తిని కోల్పోయిందని చెప్పారు, ముందు వీటి గురించి మాట్లాడితే బాగుంటుందని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: