ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా... చివరకు ప్రజలకు మిగిలేది శూన్యమే తప్పించి ఏమి ఉండదు.  ప్రజల కష్టాలు తీరవు.. నష్టాలు రాకుండా ఉండవు.  జబ్బు చేసినా.. రోడ్డున పడ్డా కష్టపడాల్సిందే..తిరిగి నిలబడాల్సిందే.  అందుకే పెద్దలు చెప్తుంటారు.  అన్నింటికంటే లాభసాటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది రాజకీయమే అని అంటారు.  రాజకీయాల్లోకి వచ్చి ఒక్కసారి రాణించడం మొదలు పెట్టారు అంటే డబ్బు అదే వస్తుంది. 

ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించవచ్చో.. అన్ని రకాలుగా డబ్బు నాయకుల బ్యాంకులకు చేరుతుంది.  బినామీల పేర్లతో సునామిలాంటి అవినీతికి పాల్పడుతుంటారు.  2014లో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది.  రెండు రాష్ట్రాలకు ఎన్నికలు 2014లో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో టిడిపి అధికారంలోకి వచ్చింది.  అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ళలో ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని వైకాపా విమర్శించింది.  


2014 నుంచి 2019 జరిగిన అవినీతి గురించి మాట్లాడితే బాగుంటుందని ట్వీట్ చేశారు.  అమరావతిలో భారీ అవినీతి జరిగిందని, అమరావతి నుంచే లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని వైకాపా నాయకులు తెలిపారు.  ఇక అవినీతి చక్రవర్తి పేరుతో వైకాపా నేతలు బాబు గురించి రాసిన పుస్తకం హాట్ టాపిక్ గా మారింది.  ఈ పుస్తకంలో ఎక్కడ ఎంత అవినీతి చేశారనే దాని గురించి వివరించారు.  


ఇక బాబు కూడా అదే రీతిలో వైకాపా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.  వైకాపా అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.  పోలవరంలో 7500 కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు.  మేము అవినీతికి పాల్పడితే.. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.  ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోనే సరిపోతుంది తప్పించి అవినీతికి పాల్పడకుండా మాత్రం ఉండలేకపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: