దేశంలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక మాంద్యం కారణంగా వివిధ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్రం. ఈ క్రమంలోనే ప్రభుత్వ పరిధిలోని బ్యాంకులను కుదించేందుకు నిర్ణయించింది. కాగా ఈ నిర్ణయం లో భాగంగా ఆంధ్ర బ్యాంక్ ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో విలీనం చేయడానికి కేంద్రం నిర్ణయించింది. అయితే ఆంధ్ర బ్యాంక్ ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయవద్దు అంటూ ఇప్పటికే పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

 

 

 

 అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆంధ్ర బ్యాంక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలకు ఎంతో దగ్గర అయినా ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు లో విలీనం కావడం తనను తీవ్రంగా బాధిస్తోంది హరీష్ రావు అన్నారు. నేడు బిఆర్కే భవన్ లో ఆంధ్ర బ్యాంక్ సెక్రటేరియట్ బ్రాంచ్ ని మంత్రి ప్రారంభించారు. ఎక్కువ శాతం గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తుంది ఆంధ్రాబ్యాంకే నని ... గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయాలని దాని కోసం తమ ప్రభుత్వం తరఫున సహాయసహకారాలు కూడా ఉంటాయని హరీష్ రావు వెల్లడించారు. 

 

 

 

 అయితే ఆంధ్ర బ్యాంక్ ను యూనియన్ బ్యాంక్ లో విలీనం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా ఇష్టం లేదని తెలిపిన హరీష్ రావు... ఆంధ్ర బ్యాంకు విలీనాన్ని ఆపాలని కేంద్రానికి డిమాండ్ చేశారు. ఆంధ్ర బ్యాంకు నుండి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకు అధికారులు నిరంతరం కృషి చేయాలని హరీష్ రావు సూచించారు. కాగా బిఆర కే భవన్ లో ఆంధ్ర బ్యాంకు  సచివాలయం ఏర్పాటు చేసినందుకు హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు  బ్యాంక్ సిబ్బంది.

మరింత సమాచారం తెలుసుకోండి: