ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నూతన మధ్యం  విధానం తెలంగాణలో రానే వచ్చింది. నూతన మద్యం విధానాన్ని ఎక్సైజ్ శాఖ నేడు ప్రకటించింది. కాగా  ఈ మధ్యం  విధానం 2019 నవంబర్ 1 నుంచి 2020 అక్టోబర్ 31 వరకు అమలులో ఉండనున్నట్లు తెలిపింది ఎక్సైజ్ శాఖ. అయితే ఈ నూతన మద్యం విధానంలో భాగంగా రాష్ట్రం మొత్తంలో 2, 216 మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు . అయితే వైన్ షాప్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఫీజు ను భారీగా పెంచి షాకిచ్చింది నూతన మద్యం విధానం. 

 

 

 

 లక్ష రూపాయలు ఉన్న దరఖాస్తు ఫీజును రెండు లక్షలకు పెంచేసింది ఎక్సైజ్ శాఖ. కాగా దీన్ని తిరిగి ఇవ్వరు. అయితే  గతంలో మాదిరిగానే లాటరీ విధానంలోనే మద్యం షాపులను ఎంపిక చేస్తారు అధికారులు. అయితే గతంలో ఉన్న నాలుగు స్లాబ్ లను 6 స్లాబు గా మార్చింది ఎక్సైజ్ శాఖ. ఇక జనాభా ప్రాతిపదికన లైసెన్స్ దరఖాస్తు ఫీజును నిర్ణయించింది. కగా  మద్యం షాపుల నడిపే సమయాన్ని కూడా మార్చింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మద్యం షాపులకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులను నిర్వహించ వచ్చని  అనుమతించింది. 

 

 

 

 

 ఇక ఇతర ప్రాంతాల్లో ఉండే మద్యం షాపులు 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించవచ్చని చెప్పింది ఎక్సయిజ్ శాఖ . అయితే జనాభా ప్రాతిపదికన దరఖాస్తు ఫీజు వివరాలను వెల్లడించింది ప్రభుత్వం. కాగా గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలలో మధ్యం షాపుల మూసివేసే సమయాన్ని పది గంటల వరకు ఉన్న దాన్ని  11 గంటల వరకు పెంచడంతో మందుబాబులు పండగ చేసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: