ఏపిలో డ్రగ్స్ కలకలం సృష్టించింది.   విద్యార్థులకు టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఓ కార్పొరేట్ కాలేజీలో గంజాయి వ్యవహారం వెలుగు చూసింది.    కార్పోరేట్ కాలేజ్ అడ్డగా చేసుకొని డ్రగ్స్ కి కొంత మంది స్టూడెంట్స్ అలవాటు పడ్డారని..ఆ మత్తులో వారు విచక్షణ కోల్పోయి కొన్ని అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారన్న ఆరోపణ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు విద్యార్థుల రక్త నమూనా సేకరించారు.

అయితే రక్త పరీక్షలో డ్రగ్స్ నమూనా గనక తేలినట్లయితే వారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు.  కాగా, నవ్యాంధ్ర రాజధానికి అమరావతికి మంగళగిరి అత్యంత కీలకమైన ప్రాంతం... సీఎం, మాజీ సీఎం, మంత్రులు, కీలక అధికారులు.. ఇలా ప్రభుత్వ వ్యవహారాలు మొత్తం మంగళగిరి కేంద్రంగానే జరుగుతున్నాయి. ఇలాంటి ప్రాంతంలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.

గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్రంగా గంజాయి, మత్తు పదార్థాల రవాణా కొనసాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల టోల్ గేట్ వద్ద కూడా గంజాయి ఇతర మత్తు పదార్థాలను  రవాణా జరుగుతుండగా పట్టుకొని వాటిని స్వాదీనం చేసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: