లోకనాయకుడు కమల్ హాసన్ ఉన్నదున్నట్టు మాట్లాడే వ్యక్తి. తాను అనుకున్నది, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడానికి వెనుకాడని వ్యక్తి. ఇటివల అమిత్ షా హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా.. ‘దేశంలో హిందీ భాష ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరముంది. యావత్ భారతదేశానికి ఒక కామన్ భాష ఉండాల్సిన అవసరముంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై కమల్ అప్పట్లోనే స్పందిచినా.. ఇటివల మళ్లీ హిందీ భాషపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.

 


“తమిళం, తెలుగు, సంస్కృతంతో పోలిస్తే హిందీ భాష చాలా చిన్నది. దేశంలో ప్రాచీన భాషలంటే ఈ మూడే వస్తాయని తరువాతే ఎక్కడో హిందీ ఉంటుంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటివల తమిళనాడు వచ్చిన మోదీ మద్రాస్ ఐఐటీలో జరిగిన కార్యక్రమంలో తమిళ భాష గొప్పదనంపై మాట్లాడి తమిళులను శాంతపరచే ప్రయత్నం చేశారు. అయినా తమిళవాసులు ఎక్కడా శాంతించినట్టు లేరని కమల్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. దీనిపై దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యతిరేకత కంటే తమిళనాడులో వ్యక్తమైన వ్యతిరేకత తీవ్రత ఎక్కువ. వాస్తవానికి తన వ్యాఖ్యలపై అమిత్ షా.. తాను మాతృభాష తర్వాత ద్వితీయ భాషగా మాత్రమే హిందీని నేర్చుకోవాలని చెప్పానని కూడా వివరణ ఇచ్చుకున్నారు కూడా. ఈ అంశాన్ని అన్ని రాష్ట్రాలు మర్చిపోయినా తమిళనాడు ఇంకా మర్చిపోలేదు.

 


తమిళులు తమిళ భాషను ఏ స్థాయిలో చూస్తారో తెలియనిది కాదు. తమిళులు తమిళ భాషను తమలో భాగంగా చూసుకుంటారు. తమిళ భాషను ఎవరైనా పరోక్షంగా తక్కువ చేస్తున్నట్టు అనిపించినా ఆ రాష్ట్రంలో నిరసనలు ఓస్థాయిలో జరుగుతాయి. జయలలిత సీఎంగా ఓ టర్మ్ లో గవర్నమెంట్ ఉద్యోగులు తమ సంతకాలు తమిళంలోనే చేయాలని ఆదేశాలిచ్చారు. అటువంటిది తమిళనాడులో హిందీ ప్రాబల్యం పెంచాలంటే వారు ఊరుకుంటారా..


మరింత సమాచారం తెలుసుకోండి: