ప్రపంచంలో ఉగ్రవాదం పెరడవిల్లుతుంది..ఎక్కడ చూసినా మారణహోమాన్ని సృష్టిస్తున్నారు ఉగ్రవాదులు.  చిన్నా పెద్దా ఆడ, మగ అనే తేడా లేకుండా అందరిపై తమ ఉన్మాదాన్ని చూపిస్తున్నారు.  కాల్చివేత,ఊచకోత,మానవబాంబులు ఇలా ఎన్నో విధాలుగు విధ్వంసాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.  జిహాద్ అనే నినాదంతో ఎంతో మంది అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు.  తాజాగా ఉగ్రవాదుల గురి భారత్ పై పడింది. ఇప్పటికే పలు చోట్ల విధ్వంసాలకు పాల్పపడ్డ ఉగ్రమూక మరోసారి తన పంజా విసరాలని చూస్తుంది. 

ఈ నేపథ్యంలో తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉగ్ర కదలికలు ఉన్నట్లు ఆర్మీ గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఇంటిలీజెన్స్ వర్గాలు తెలుపుతున్నారు. ఢిల్లీతో పాటు స‌మీప ప‌ట్ట‌ణాల్లో భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు. నగరంలో ఉగ్రవాదులు చొరబడ్డారనే హెచ్చరికలతో ఈ రోజు ఉద‌యం ప్ర‌ధాని మోదీ నివాసంలో కీలక నేతలు సమావేశమై చ‌ర్చలు జరిపారు. కశ్మీర్ విషయంలో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అనంతరం నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉగ్రవాదులు పలు ప్రాంతాలలో ఉగ్ర‌దాడులు చేసే యోచలో ఉన్నట్లు ఇప్పటికే ఇంటిలీజెన్స్ వర్గాలు చెప్పారు.

ఈ నేపథ్యంలో  శ్రీన‌గ‌ర్‌, అవంతిపురా, జ‌మ్మూ, ప‌ఠాన్‌కోట్‌, హిండ‌న్ లాంటి వైమానిక స్థావ‌రాల వ‌ద్ద ఆరెంజ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. రక్షణ మంత్రిత్వ శాఖ,ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అందిన సమాచారం ప్రకారం..జైష్-ఎ-మొహమ్మద్ వైమానిక స్థావరాలపై ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం,ఇంటలిజెన్స్ కి చెందిన అధికారులు కలిసి సిటీలోని 9లొకేషన్స్ లో రైడ్స్ నిర్వహించారు. ఇద్దరు అనుమానితులని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: