పైన వున్న హెడ్దింగ్ చదివి ఆశ్చర్యపోతున్నారా! ఓ మనిషి మరణిస్తేనే అంత నష్టం జరగదు.అలాంటిది,నోరులేని ప్రాణి మరణం వెనుక అంత నష్టం ఎలా వుంటుందని ఆలోచిస్తున్నారా.నిజమేనండి ఓ మేక మరణం ఆ సంస్థకు భారీ నష్టాన్ని తెచ్చింది.ఆ నష్టం ఎంత అంటే అక్షరాల రూ. 2.7 కోట్లు..ఇది వినడానికి వింతగా ఉన్నా,అబ్బో అని నోరెళ్లపెట్టిన ఇదే నిజమట. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలో చోటుచేసుకుంది..



భారతదేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన కోల్ ఇండియాకి చెందిన మహానంది బొగ్గు క్షేత్రం ఇంత నష్టాన్ని మూటగట్టుకుందట. మహానంది బొగ్గు క్షేత్రం ఉన్న సంబల్ పూర్‌ ప్రాంతంలోని,నిషేధిత మైనింగ్ జోన్‌ పరిధిలో జరిగిన ఓ ప్రమాదంలో మేక చనిపోయింది.ఆ మేక సమీప గ్రామస్తులది కావడంతో,అక్కడ వుండే స్థానికులు ఆమేక యజమానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారట.ఈ ఆందోళన కారణంగా దాదాపు మూడున్నర గంటల పాటు ఎంసీఎల్‌ వద్ద బొగ్గు రవాణా నిలిచిపోయి తగని నష్టం వాటిల్లిందట..



పనులు జోరుగా సాగుతున్న వేళ అకస్మాత్తుగా బొగ్గు రవాణా నిలిచిపోవడంతో మహానంది బొగ్గు క్షేత్రంకు కోట్లాది రూపాయలు నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు.ఇక ఎంతగా సర్దిచెప్పిన గ్రామస్థులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశంచేసి పరిస్థితిని చక్కదిద్ది,ఆందోళనను విరమింపచేసారట.అప్పుడుగాని బొగ్గురవాణా పనులు తిరిగి ప్రారంభం అయ్యాయట.అయితే ఈ ఆందోళన కారణంగా సంస్థకు 26.8 మిలిన్ల డాలర్లు నష్టం వాటిల్లిందని ఎంసీఎల్ సంస్థ ప్రతినిధి డికెన్‌ మెహ్రా వెల్లడించారు.



స్థానిక ప్రజలు బొగ్గు,కట్టెలకోసం,అలాగే వారి పశువులను మేపేందుకు తమ పరిధిలోని నిషేధిత ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడతారనీ మెహ్రా తెలిపారు.అందుకే ఈ ఆందోళ నలకు దిగిన నిరసనకారులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసానని, ఇదంత వారు తెలిసే చేసారని వెల్లడించారు.ఇక ఆకులు తిందామని వెళ్లిన ఓ మేక మరణం ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసి, ఇన్ని కోట్ల నష్టాన్ని తెస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు.అందుకే మేకనా మజాకా అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన వారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: