ఆంధ్ర ప్రదేశ్ లో  తెలుగుదేశంకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరుకూడా ఒక్కొక్కరుగా పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. పక్కాగా చెప్పాలంటే మాత్రం సొంత సామాజికవర్గానికి చెందిన నేతలు మరియు బీసీ నేతలందరూ కూడా నెమ్మదిగా పార్టీని వదిలి పెడతారు అని తెలుస్తుంది. అసలే ఇబ్బందుల్లో ఉన్న టీడీపీకు నేతల పార్టీ మార్పు నిర్ణయాలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇలా అందరు వెళ్ళిపోడానికి కారణం మాత్రం పార్టీ మీద నమ్మకం లేకనే అని అందరు అనుకుంటున్నారు.

 తెలుగుదేశం పార్టీలో కీలకంగా  పనిచేసిన విశాఖ జిల్లాలో సీనియర్‌ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేష్‌, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. ఆయన బీజేపీ పార్టీ లోకి మారుతున్నారు అని చర్చలు. ఇకపోతే టీడీపీ కి రాజీనామా చేసిన తోట నగేష్ వైసీపీ లో చేరతారా, లేక బీజేపీ లే చేరతారా అనేది తెలియాల్సి ఉంది.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలవడంతో టిడిపి శ్రేణుల్లో చాల నిరాశ  నెలకొంది. 

ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసిపి , టిడిపి నేతలను టార్గెట్ చేసుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి నేతలు ఆరోపణ చేస్తున్నారు.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి చాలామంది నేతలు భయపడుతున్నారు కూడా. కాగా తాజాగా విశాఖ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు తోట నగేష్ టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని అందరు అనుకుంటున్నారు.

అంతేకాకుండా గత కొన్ని రోజులుగా అటు వైసీపీ మరియు ఇటు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీ మీద ఉన్న అసంతృప్తి కారణంగానే తోట నగేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని పలు వర్గాలు చెప్తున్నారు. నగేష్ తో పాటే మిగిలిన కొందరు నేతలు కూడా టీడీపీ ని వదిలిపెడుతున్నారని, ఇంకా వాళ్ళు ఎవరో త్వరలో  తెలుస్తుందని  అని తెలుపుతున్నారు .. ఇకపోతే టీడీపీ కి రాజీనామా చేసిన తోట నగేష్ వైసీపీ లో చేరతారా, లేక బీజేపీ లే చేరతారా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఎన్నికలు ముగిసి 5 నెలలైనా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో టీడీపీకి గుడ్ బై చెప్పడానికి తోట నగేష్ సిద్ధమయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: