ఈ మధ్య ఎక్కడ చూసినా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అందినకాడికి దోచుకుని  సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది గ్రూప్ గా వస్తే కొంతమంది సింగిల్ గా వస్తున్నారు. దొంగలు ఎలా వచ్చినా భారీగానే దోచుకెళ్తున్నారు . ఒకప్పుడు దొంగలు ఏమో కానీ ఇప్పుడు దొంగలు అయితే చాలా తెలివిమంతుడు అయ్యారు. దొంగతనం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి అనే దానిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇక దొంగతనం చేసిన దొంగలను పట్టుకునేందుకు కేసు విచారణ చేస్తున్నా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. 

 

 

 

 

 అయితే గత నెల బంజారాహిల్స్ లో భారీ చోరీ జరిగింది. దాదాపు రెండు కోట్ల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు. గత నెల బంగారం చోరీ తర్వాత చోరీ చేసిన దొంగలు పోలీసులకు దొరకకుండా చాలా తెలివిగా ప్లాన్ చేసారు. ఈ నేపథ్యంలో నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు. దీంతో దొంగతనం జరిగిన చోట సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వచ్చిన దుండగుడు మాస్క్ వేసుకోవడం తో పోలీసులకు ఎలాంటి ఆచూకీ దొరకలేదు. 

 

 

 

 

 ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ ముమ్మరం చేసి ఎంతో చాకచక్యంగా  2 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు నిందితున్ని బెంగళూరులో అరెస్ట్ చేశారు . అంతేకాదు రెండు కోట్ల భారీ దొంగతనం చేసిన దొంగ మామూలుగా దొంగ  కాదండోయ్... 16 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినా గజదొంగట. అలాంటి క్రిమినల్ దొంగని  పట్టుకుని  అరెస్ట్  పోలీసులు ఉన్నతాధికారులు అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: