మాజీ ప్ర‌ధాని మ‌న్మోహన్‌సింగ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. క‌ర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్స‌వ వేడుక‌లో ఆయ‌న పాల్గోనున్నారు. న‌వంబ‌ర్ 9వ తేదీన ఈ వేడుక జ‌ర‌గ‌నున్న‌ది. ఇందుకోసం ఆయ‌న పాకిస్థాన్ వెళ్ల‌నున్నారు. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌తో పాటు పంజాబ్ సీఎం మ‌రీంద‌ర్ సింగ్ కూడా క‌ర్తార్‌పూర్ వెళ్ల‌నున్నారు. ఈ నిర్ణ‌యం ప్ర‌ధాని మోదీని ఇర‌కాటంలో పడేసేద‌ని అంటున్నారు. 


సిక్కుల గురువైన గురు నానక్‌ 550వ జయంతి ఉత్సవాలు నవంబర్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ కర్తార్‌పూర్‌లోని దర్బార్‌ సాహెబ్‌ గురుద్వారా, పంజాబ్‌ గురుదాస్‌పూర్‌ జిల్లాలోని డేరా బాబా నానక్‌ గురుద్వారాలను కలుపుతూ ప్రత్యేక కారిడార్‌ను భారత్‌,పాక్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో...ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్రమోదీని కాదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఆహ్వానం పంపాలని నిర్ణయించింది. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. 


క‌ర్తార్‌పూర్ ప్రారంభోత్స‌వానికి రావాలంటూ మ‌న్మోహ‌న్‌కు ఆహ్వానం అందింది. అయితే ఆ వేడుక‌లో పాల్గొనేందుకు మ‌న్మోహ‌న్ వెళ్ల‌డం లేద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు మొద‌ట్లో వెల్ల‌డించాయి. దీనిపై ఇవాళ మ‌రో క్లారిటీ వ‌చ్చింది. ఆఖిల ప‌క్ష పార్టీ నేత‌ల‌తో క‌లిసి పాక్‌కు మ‌న్మోహ‌న్ వెళ్ల‌నున్న‌ట్లు తాజాగా తెలిసింది. గురునాన‌క్ 550వ జయంతి వేడుక‌ల్లో మాజీ ప్ర‌ధాని మన్మోహ‌న్ పాల్గొంటారు.పాక్‌కు వెళ్తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను పంజాబ్ సీఎం మ‌రీంద‌ర్ సింగ్ ఖండించారు. క‌ర్తార్‌పూర్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌డం లేద‌ని అమ‌రీంద‌ర్ స్ప‌ష్టం చేశారు. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కూడా వెళ్ల‌ర‌ని ఆయ‌న అన్నారు. మ‌రోవైపు,  పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్ లోద్‌లో జ‌రిగే ఈవెంట్‌లో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌తో పాటు ప్ర‌ధాని మోదీ కూడా పాల్గొంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ...స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: