అమెరికాలో డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ నిర్వహిస్తున్నభారత సంతతికి చెందిన మిలియనీర్ తుషార్ అట్రే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాలిఫోర్నియాలోని త‌న నివాసంలో కిడ్నాపైన తుషార్ అట్రేను కొండలు, దట్టమైన అటవీ ప్రాంతానికి సమీపంలోని తుషార్ అట్రేకు చెందిన స్థలంలో బీఎండబ్ల్యూ కారుతోపాటు ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తుషార్ అట్రేను అతడి స్నేహితురాలికి చెందిన బీఎండబ్ల్యూ కారులో ఎత్తుకెళ్లారని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాలిఫోర్నియా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 


మంగళవారం కొంతమంది కాలిఫోర్నియాలోని తుషార్ అట్రే నివాసంలోకి చొరబడి కిడ్నాప్ చేశార‌ని స‌మాచారం. సముద్రానికి సమీపంలో ఉన్న తన విలాసవంతమైన నివాసం నుంచి ఆయ‌న్ను దుండగులు అపహరించారు. ఆయన కారును పోలీసులు కొండప్రాంతాల్లో గుర్తించారు. తుషార్ అట్రే కిడ్నాప్, హత్యకు సంబంధించిన కారణాలు విశ్లేషించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని షరిఫ్ కార్యాలయం ఫేస్‌బుక్ కథనంలో వెల్లడించింది. తుషార్ అట్రే కిడ్నాప్, హత్య కేసులో కనీసం ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవలే తుషార్ అట్రే ఇంటి నుంచి బీఎండబ్ల్యూ కారు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు.


కాగా, సోషల్‌మీడియాలో చురుకుగా ఉండే తుషార్ అట్రేకు సర్పింగ్ అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు చూస్తే అతడికి సాహసాలు చేయడం ఇష్టమని, ప్రకృతి ప్రేమికుడని స్ప‌ష్ట‌మ‌వుతోంది. కాలిఫోర్నియా శాంటా క్రూజ్‌లోని తన నివాసం నుంచి దుండగులు తెల్లవారుజామున ఆయనను కిడ్నాప్‌ చేశారు. ఆయన చివరిసారిగా తెల్లరంగు బిఎండబ్ల్యూ కారులోకి ఎక్కుతూ సిసిటివీ కెమెరాల్లో కనిపించారు. తుషార్ ఆత్రే నివాసం నుంచి ఎమర్జెన్సీ నంబర్‌ 911కు ఫోన్‌ కాల్‌ వచ్చిందని, జరిగిన నేరం గురించి ఆత్రే సంబంధికులు ఫోన్‌ చేశారని పోలీసులు తెలిపారు. తుషార్ హ‌త్య‌పై పోలీసులు వివిధ కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: