ఏపీ లో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. బెల్ట్ షాపులను మూసివేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం ఆధ్వర్యంలోని మద్యం షాపులు నిర్వహించి రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం వైపుగా అడుగులు వేస్తోంది. అయితే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున కూడా జిల్లాలో లిక్కర్ అమ్మకాలు జరిపారంటూ  టిడిపి అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

 

 

 

 అయితే చంద్రబాబునాయుడు విమర్శలపై స్పందించిన ఏపి డిప్యూటీ సీఎం,  ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి చంద్రబాబు నాయుడు కి సవాల్ విసిరారు.మధ్యం నిషేధం  చేద్దాం అని చెబుతున్నా జగన్ అక్టోబర్ 2 న  మధ్యం  అమ్మకాలు జరిపారు అంటూ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను ఖండించిన ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి... ప్రజలు దూరమయ్యారని బాధతోనే చంద్రబాబు ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు పిచ్చి పట్టిందా లేక అధికారంలోకి మళ్ళీ రాలేమని   భయం పట్టుకుందా అర్థం కావట్లేదు అన్నారు. ఇక తమ పార్టీ అధికారంలోకి రాదని చివరికి తపస్సు చేసుకోవాల్సి వస్తుందని అర్థమయ్యే చంద్రబాబు టెన్షన్ పడుతున్నారన్న   మంత్రి... అందువల్లే అబద్ధపు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. 

 

 

 

 

 ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్వామి చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో అక్టోబర్ 2న ఏ జిల్లాలో అయినా మద్యం అమ్మకాలు జరిగినట్లు చంద్రబాబు నిరూపిస్తే దేనికైనా రెడీ అని సవాల్ చేశారు మంత్రి నారాయణ స్వామి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తుంటే చంద్రబాబు మాత్రం నోటికొచ్చింది మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా  ఏపీ బేవరేజ్  కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: