భారీ మెజారిటీ తో ఎన్నికల్లో గెలిచినా తరువాత జగన్ ఇచ్చిన హామీలను,ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే.ఇక జగన్ పాలనపై ప్రజలు,నాయకులు సంతృప్తిగా వున్న సమయంలో బొత్స సత్యనారాయణ నోరుజారాడు ఇంతకు అసలు విషయమేంటంటే.గురువారం నాడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైనటువంటి వైసీపీ సీనియర్ నేత,ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మాటాడుతూ…తన సొంత పార్టీ పైన కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు.



ఇక బొత్సకి రాజకీయాల్లో చాలా అనుభవం ఉందన్న సంగతి మనకు తెలిసిందే.కాగా తానూ చేసిన వాఖ్యలు తప్పిదం వల్ల జరిగాయేమో అని పలువురు అంటున్నారు.ఇంతకీ బొత్స ఏమన్నారంటే…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని,కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనంత అద్వానమైన పరిస్దితిలో ఉందని బొత్స సత్యనారా యణ అన్నారు.ఆతర్వాత సర్ధుకుని మాట్లాడుతూ,ప్రస్తుతానికి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రాడానికి కేవలం గత టీడీపీ ప్రభుత్వ పనే అని,టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందని అన్నారు.



అయితే తమ వైసీపీ ప్రభుత్వం ఒక్కోదాన్ని గాడిలో పెడుతూ వస్తుందని,అదేవిధంగా ఆర్థిక పరిస్థితిని కూడా ఒక క్రమపద్దతి లో పెడుతున్నామని వైసీపీ మంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు.కాగా తాము చేసే మంచి పనులను గుర్తించకుండా తమపై అనవసరమైన తప్పుడు ఆరోపణలు చేస్తూ,తప్పుడు నిందలు వేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడుతున్నారు మంత్రి బొత్స.



అంతేకాకుండా తమ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేయలేదని,వాటిని ఆసుపత్రుల దగ్గర ఏర్పాటు చేయదలచామని, ఆలాచేస్తే అన్నార్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, అందుకనే తాము ఈ నిర్ణయాన్నితీసుకున్నామని వివరించారు. ఇక ఇప్పుడు చంద్రబాబు అవినీతి కనిపిస్తుంది కాని మీరు ఆయన పార్టీలో మంత్రిగా పనిచేసి నప్పుడు కనబడలేదా అని కొందరు గుసగుసలాడు తున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: