దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది.  అక్టోబర్ 21 వ తేదీన మహారాష్ట్ర, హర్యానాకు ఎన్నికలు జరగబోతున్నాయి.  ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నారు.  అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించి వారిని గెలిపించుకోవడానికి రెడీ అవుతున్నారు.  రాజకీయాల్లో మొదటి నుంచి ఉండే వ్యక్తులకు, ఆర్ధికంగా పలుకుబడి ఉండే వ్యక్తులకు లేదంటే సినిమా రంగంలో ఉండే వ్యక్తులకు టిక్కెట్స్ ఇస్తుంటారు. 

అయితే, ఈసారి సోషల్ మీడియాలో పాపులరైనా వ్యక్తులకు కూడా టిక్కెట్స్ ఇస్తోంది.  సోనాలి ఫోగాట్ అనే మహిళ టిక్ టాక్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది.  ఆమెకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.  అంతేకాదు, సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియోలకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియా స్టార్ గా మారిపోవడంతో ఆమెను రాజకీయాల్లోకి ఆహ్వానించింది బీజేపీ.  


రాజకీయాల్లోకి తీసుకురావడమే కాకుండా హరియానాలోని అదంపూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది.  అయితే, ఈ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 1969 వ సంవత్సరం నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తోంది.  హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ 8 సార్లు విజయం సాధించారు.  ఆ తరువాత అయన భార్య రెండు సార్లు విజయం సాధించింది.  అనంతరం అయన కుమారుడు అక్కడినుంచే విజయం సాధించాడు.  


అయితే, 2014లో భజన్ లాల్ కుమారుడు కులదీప్ బిష్ణోయ్ హరియాణా జనహిత కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు.  అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్ టాక్ స్టార్ ఫోగాట్ కు గట్టిపోటీ ఉండే అవకాశం ఉంది.  ఎంత టిక్ టాక్ స్టార్ అయినప్పటికీ ... రాజకీయాల్లో రాణించాలంటే దానికి తగినట్టుగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలి.. ప్రజల మధ్యన తిరగాలి.  మరి ఈ టిక్ టాక్ స్టార్ రాజకీయాల్లో ఎంతవరకు రాణిస్తుందో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: