జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎడుర్కుంటున్నారా  అంటే అవుననే అంటున్నారు పార్టీలోని కొందరు నేతలు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు 30 నుంచీ 40 సీట్ల వరకూ నెగ్గుకోస్తామని ఏపీలో కింగ్ మేకర్ అవుతామని పవన్ కళ్యాణ్ భావించినా ఏపీ ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ నాయకత్వాని ఏ మాత్రం అంగీకరించలేదు సరికదా ఏపీ హిస్టరీ లోనే ఒకే ఒక్క సీటు గెలిచిన ఏకైక పార్టీగా మిగిలిపోయారు. ఇదిలాఉంటే ఒక్క సీటు మాత్రమే కాదు రానున్న కాలంలో పవన్ కళ్యాణ్,  ఒకరిద్దరు తప్ప  పార్టీలో ఎవరూ ఉండే అవకాశమే లేదని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే..

 

ఎన్నికల్లో ఘోరమైన పరాజయం మొదలు  జనసేన నుంచీ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. తాజాగా పార్టీలో ముఖ్య నేతగా ఉన్న చింతల పార్ధ సారధి పార్టీ నుంచీ బయటకి రావడం ఆ పార్టీని అస్తిత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలోనే పార్టీలోని సీనియర్ల దృష్టి కూడా వేరే పార్టీలపై పడుతోందనేది ఆ పార్టీలోని లుకలుకల బట్టి తెలుస్తోందట. పార్టీ ఏర్పాటు చేసి ఏళ్ళు గడుస్తున్నా సరే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో పవన్ కళ్యాణ్ వైఫల్యం చెందుతూనే ఉన్నారు.

 

మరి సంస్థాగతంగా ఎందుకు ఇన్నేళ్ళ నుంచీ పార్టీని బలపరచడం లేదు అంటే అందుకు కారణం కూడా లేకపోలేదు అంటున్నారు విస్త్రాంత ఐఏఎస్ అధికారి, జనసేన తరుపున అనకాపల్లి ఎంపీ స్థానం నుంచీ పోటీ చేసిన చింతల పార్ధ సారధి. పార్టీని సంస్థాగత బలోపేతం చేస్తే అభిమానులు ఇబ్బంది పడుతారని ఈ క్రమంలో అసలుకే ఎసరు వస్తుందని పవన్ అభిప్రాయమని ఆయన తెలిపారు. అయితే పార్ధ సారధి వెళ్తూ వెళ్తూ కొని ప్రశ్నలు సంధించారు. కుటుంభ పాలనికి, కుల తత్వానికి వ్యతిరేకమని చెప్పే పవన్ కళ్యాణ్  తన అన్నయ్య నాగబాబు కి ఎలా టిక్కెట్టు ఇచ్చారని ప్రశ్నించారు.

 

పవన్ మాట తప్పారని జనసేన లో ఉంటే భవిష్యత్తుకి మనుగడ లేదని ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఊహించని రీతిలో ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తూ జనసేనపై విరుచుకు పడటంతో ఒక్క సారిగా పార్టీ వర్గాలు షాక్ తిన్నాయి. అంతేకాదు పార్టీ నుంచీ ఆయన వెళ్ళిపోవడంతో పార్టీలోని మరో కొందరు నేతలు కూడా భవిష్యత్తు నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరందరికీ బీజేపీ కండువాలు కప్పడానికి సిద్దంగా ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. మరో పక్క రానున్న రోజుల్లో వైసీపీ కూడా జనసేన పార్టీ నుంచీ తమ పార్టీలోకి వచ్చే వారికి ఆహ్వానం అందించడానికి సిద్దంగా ఉందట. ఇదే గనుకా జరిగితే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఒంటరవ్వడం ఖాయమని అంటున్నారు రాజకీయ పండితులు.


మరింత సమాచారం తెలుసుకోండి: