మనుషుల్లో మానవత్వం రోజురోజుకు మంట కలిసి పోతుంది. సాటి మనుషులపై మనుషులు కనీస మానవత్వం చూపడం లేదు. సైకోలా  తయారవుతున్న కొంతమంది మనుషులు ఇతరులపై దాడిచేసి రాక్షసానందం పొందుతున్నారు. అయితే మగాళ్ళు ఆడవాళ్ళ పై అత్యాచారం చేసిన సంఘటనలు ఎన్నో చూసాం. కానీ ఇక్కడ మాత్రం సభ్యసమాజం తలదించుకునే సంఘటన జరిగింది. ఒక మహిళ మరో మహిళపై కనీస మానవత్వం చూపలేకపోయింది. ఒక మహిళపై దాడి చేయడమే కాకుండా ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేయించింది ఆ మహిళ. ఇంతటితో ఆగకుండా సాటి మహిళలను హింసిస్తూ   రాక్షసానందం పొందింది. 

 

 

 

 

 

 

 సభ్య సమాజం తలదించుకునే ఘటన అమెరికాలోని ఓక్లహోమా లో చోటుచేసుకుంది. లారా ఫల్మర్  అనే మహిళ తన ఇంట్లో 12 వేల రూపాయలు  దాచి పెట్టింది. అయితే ఆ తర్వాత డబ్బులు కనిపించకపోయేసరికి ఆ డబ్బులను మరో మహిళ దొంగలించి ఉంటుందని భావించి... ఆమెను బంధించింది. తన ఇద్దరు స్నేహితులను ఇంటికి పిలిపించి వారితో ఆ మహిళపై రేప్ చేయించింది. అంతేకాకుండా ఆ బాధిత మహిళను శారీరకంగా హింసించి కర్కశత్వాన్ని ప్రదర్శించింది  మరో మహిళ. 

 

 

 

 

 

 అత్యాచారం అనంతరం బాధితురాలిని బాత్రూంకి లాక్కెళ్లి... డ్రిల్లింగ్ బిట్ తో  బాధితురాలు చంకలో గాయం చేసి ఆ గాయం పైన యాసిడ్  పోసి  క్రూరత్వాన్ని  ప్రదర్శించి రాక్షసానందం పొందింది. అనంతరం తన దగ్గర ఉన్న తుపాకీతో బెదిరించి బాధిత మహిళ పై అత్యాచారం చేసింది. అయితే వాళ్ల దగ్గర నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం తెలిపింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే నిందితులు  అక్కడి నుంచి పరారయ్యారు. ఫల్మర్  ఇంట్లో దొరికిన డ్రిల్లింగ్ బిట్ ను  తుపాకిని స్వాధీనం చేసుకున్న పోలీసులు...ఫల్మర్  పై ఫస్ట్ డిగ్రీ రేప్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: