పెట్రోల్, డీజల్ ధరలు నిన్నటి నుండి భారీగా తగ్గుతున్నాయి. ఈరోజు కూడా పెట్రోల్ ధర మళ్ళి దిగొచ్చింది. నేడు 10 పైసలు దిగొచ్చింది. ఇలా 10 పైసలు, 12 పైసలు తగ్గడం వరుసగా రెండో రోజు. పెట్రోల్ 10 పైసలు తగ్గిన డీజల్ ధర మాత్రం నిలకడగా నిన్నటి కొనసాగింది. దీంతో ఈరోజూ హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.79.04కు చేరింది.     

     

కాగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా పెట్రోల్ ధర పరిస్థితి ఇలానే ఉంది. డీజిల్ ధర కూడా భారీగా తగ్గింది. పెట్రోల్‌ ధర 18 పైసలు తగ్గుదలతో రూ.78.62కు చేరగా. డీజిల్‌ ధర 8 పైసలు క్షీణతతో రూ.72.68కు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 18 పైసలు తగ్గుదలతో రూ.78.25కు చేరగా, డీజిల్ ధర 8 పైసలు క్షీణతతో రూ.72.34కు చేరింది.       

       

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. పెట్రోల్ ధర 18 పైసలు తగ్గుదలతో రూ.74.33కు క్షిణించగా డీజిల్ ధర 8 పైసలు క్షీణతతో రూ.67.35కు చేరింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఏది ఏమైనా ఈ పెట్రోల్, డీజల్ ధరలు భారీగా తగ్గడంతో వాహనదారులు కొంచం ఊపిరి పీల్చుకుంటున్నారు. గత నెల చలాన్ తో సహా ఈ పెట్రోల్ డీజల్ ధరలు రోజుకు 10పైసలు ప్రకారం పెంచుతూ ఒకటిన్నర నెలలో 3రూపాయిలు పంచేసింది. అయితే ఇప్పుడు మాత్రం వీటికి భిన్నంగా రోజుకు 10 పైసలు తగ్గుతూ వచ్చింది. మరి ఇలా తగ్గుతూ పెరిగిన 3 రూపాయిలు తగ్గుతుంది ఏమో చూడాలి.    
     
 


మరింత సమాచారం తెలుసుకోండి: