కొంతమందికి వేట మహా సరదా... జీవితంలో ఏమి చేయకపోయినా ఏదో ఒకటి వేటాడి తీసుకొచ్చి జీవనం సాగిస్తుంటారు.  ముఖ్యంగా అటవీప్రాంతంలో ఉండే వ్యక్తులు ఇలా చేస్తుంటారు.  వారికీ అదే జీవనంగా ఉంటుంది.  ఎందుకంటే అక్కడి ప్రజలు నాగరికతకు దూరంగా ఉంటుంటారు.  వారికీ వేట జీవనోపాధి.  దొరికినదాన్ని వేటాడి తీసుకురావడం.. దాన్ని వండుకు తినడం చేస్తుంటారు.  


నాగరిక జీవనంలో జీవితం గడిపే వ్యక్తులు సైతం అప్పుడప్పుడు వేటకు వెళ్తుంటారు.  ముఖ్యంగా అడవి కుందేళ్ల వేటకు వెళ్తుంటారు.  అలా వేటకు వెళ్లిన వ్యక్తులు కుందేళ్ళను పట్టుకొచ్చి జీవనం సాగిస్తుంటారు.  కుందేళ్ళ వేట  భలే సరదాగా ఉంటుంది.  ఒక్కోమారు అది ప్రాణాంతకం కూడా కావొచ్చు.  కుందేళ్ళను వేటాడేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.  ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి చంపోవడంతో పాపం ఆ కుటుంబం రోడ్డున పడింది.  ఈ సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.  


కర్నూలు జిల్లాలోని చంద్రపల్లి గ్రామంలో నివసించే రామకోటి రాత్రి తన మిత్రులతో కలసి పెద్దపాయ పొలాల్లోకి కుందేళ్ళ వేటకు వెళ్ళాడు. అక్కడ పెద్దపాయకు చెందిన సుబ్బారెడ్డి అనే రైతు అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకొనేందుకు పొలం చుట్టూ విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేసుకున్నాడు. వేటకు వెళ్ళిన రామకోటికి ప్రమాదవశాత్తు ఈ తీగలు తగలడంతో అతడు అక్కడికి అక్కడే మృతి చెందాడు.  


పాపం రామకోటి మరణించడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.  ఈ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.  వేటకోసం వెళ్తే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆ కుటుంబం భోరున విలపిస్తోంది.  కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.  పొలం చుట్టూ కంచెలను నిర్మించుకోవడం మంచిదే కానీ, ఆ కంచెలు వలన ప్రజలు ప్రాణాలు పోగుట్టుకుంటున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: