సాధారణంగా సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్నో దిక్కుమాలిన ఘనకార్యాలు చేస్తుంటారు.  అయితే ఇలాంటివి ఆస్తుల కోసం..లేదా ఏదైనా ప్రభుత్వ లావాదేవీల కోసం జరుగుతుంటాయి..ఇలాంటి సంఘటన అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ నల్లగొండ జిల్లాలలో ఓ ఉపాధ్యాయురాలి ఘనకార్యం చూసి అందరూ ముక్కున వేలు వేసుకున్నారు.

పదిమంది పిల్లలకు పాఠాలు చెప్పి భావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇలా సంతకం ఫోర్జరీ చేయడం కలకలం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా రావులపెంట పాఠశాలలో రూల్స్ కి మంగళం పాడింది ఓ ఉపాధ్యాయురాలు. ఏకంగా మంత్రి కేటీఆర్ ఇచ్చినట్లుగా రికమండేషన్ లెటర్ సృష్టించింది. 

రావులపెంట ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న మంగళ..జిల్లా కో ఆర్డినేటర్ పోస్ట్ కోసం ఏకంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ చేసి అందరినీ బురిడీ కొట్టించింది. అయితే ఫోర్జరీ సంతకం పై మంత్రి పేషీ ఆరా తీసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు డీఈవో ఆదేశం జారీ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: