కొడుకు ఎదిగివస్తే తండ్రికి ఆనందం. బాధ్యతలు పంచుకోవడానికి పక్కన ఉంటే ఇంకా సంతోషం.  తానున్న  ఫీల్డులోకి కొడుకుని తీసుకువచ్చినపుడు చేదోడు వాదోడుగా ఉంటూ తండ్రికి శ్రమ తగ్గిందాలనే అనుకుంటారు. మరి తెలుగుదేశం పార్టీ తీరు చూస్తే అలా ఉందా అంటే లేదనే చెప్పాలి. చంద్రబాబు తన వారసుడిగా లోకేష్ ని తెచ్చారు. ఆయన్ని ఇవాళా నిన్నా తీసుకురాలేదు. పదేళ్ళ నుంచే తండ్రి పక్కన ఉంటూ లోకేష్ బాబు ఇప్పటికీ రాజ‌కీయంగా ఓనమాలు దిద్దుతూనే ఉన్నాడు.


ఈ నేపద్యంలో లోకేష్  ని మంత్రిగా చేసి రెండేళ్ళ పాటు ముచ్చట తీర్చుకున్న చంద్రబాబుకు మాజీ మంత్రిగా లోకేష్ రాజకీయ పాండిత్యం ఏ మాత్రం పెరగలేదని అర్ధమైంది. మంగళగిరి లో ఓటమి తరువాత నాలుగు నెలలుగా లోకేష్ ట్విట్టర్ పిట్టగానే ఉన్నారు తప్ప కనీసం పార్టీని చైతన్యపరచలేకపోయారు. ప్రెస్ మీటింగ్ కూడా లోకేష్ సిధ్ధం కాలేదు. 


ఇదిలా ఉండగా లోకేష్ కి సోషల్ మీడియా వ్యవహారాలు బాబు అప్పగించారని టాక్ ఉంది. వైసీపీ విపక్షంలో ఉన్నపుడు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుని పెద్ద హిట్ కొట్టింది. దాంతో బాబు కూడా దాని అవసరం గుర్తించి తగిన వాడిగా తన కుమారుడికి ఆ బాధ్యతలు చూడమన్నారని భోగట్టా.  అయితే లోకేష్ నాయకత్వంలో అంత ఎఫెక్టివ్ గా సోషల్ మీడియాలో టీడీపీ వెలిగిపోవడంలేదు. పైగా వివాదాలు కూడా కొత్తవి వస్తుననాయని అంటున్నారు. దీంతో బాబు ఇపుడు సోషల్ మీడియా బాధ్యతలను తాను స్వయంగా పర్యవేక్షించాలనుకుంటునట్లుగా చెబుతున్నారు. 


సోషల్ మీడియాలో బాబుకు పెద్దగా పట్టు లేకపోయినా రాజకీయంగా ఉన్న అనుభవంతో ఆయన వైసీపీ మీద ఇకపై బాణాలు వేసే కార్యక్రమానికి పదును పెడతారని అంటున్నారు. మరి టెక్నాలజీ నిండా నింపుకున్న లోకేష్ బాబు టీడీపీకి ఏ విధంగా అసరాకు వస్తారో, కష్టాల్లో ఉన్న పార్టీకి ఏవిధంగా  అక్కర తీరుస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: