విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంటుంది.  విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన భాద్యత వారిదే.  దేశంలో ఎందరో గొప్పగొప్ప ఉపాధ్యాయులు ఉన్నారు.  ఎందరినో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దారు.  సెప్టెంబర్ 5 వ తేదీని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు అంటే వారికి ఎలాంటి గుర్తింపు ఇస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.  దేశ మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక సాధారణ ఉపాధ్యాయుడి జీవితం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎదిగారు.  


ఆయనే కాదు.. శాస్త్రవేత్త, దేశానికీ రాష్ట్రపతిగా చేసి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఏపీజే అబ్దుల్ కలాం కూడా గొప్ప టీచర్.  అందులో సందేహం అవసరం లేదు.  ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది.  దానికి కారణం ఏంటి.. ఎందుకు అలా జరుగుతుంది ... అంటే ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణం.  ప్రభుత్వ  ఉద్యోగి.  ఎప్పుడైనా రావొచ్చు.  


వచ్చిన తరువాత చెప్తే చెప్పొచ్చు లేదంటే లేదు.  చెప్పినా చెప్పుకున్నా పెద్దగా పట్టించుకునే వ్యక్తులు ఉండరు.  వాళ్ళు ఆడిందే అట పాడిందే పాటగా మారిపోయింది.  అందుకే పిల్లలను చాలామంది ప్రైవేట్ స్కూల్ కు పంపిస్తున్నారు.  ప్రభుత్వం పధకాలు పెడుతున్నా పిల్లలు స్కూల్ లో చేరడం లేదు అంటే దానికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణం.  


తెలంగాణలో స్కూల్స్ కు సరిగా హాజరుగాని ఉపాధ్యాయుల లిస్ట్ ను బయటకు తీసింది.  ఆ లిస్ట్ చూసి ప్రభుత్వం షాక్ అయ్యింది.  రాష్ట్రంలో విధులకు సక్రమంగా హాజరుకానీ ఉపాధ్యాయులు 106 మంది ఉన్నట్టుగా గుర్తించింది.  ఇందులో గత ఐదేళ్లుగా పాఠశాలకు హాజరుకాని ఉపాధ్యాయులు 22 మంది ఉన్నారట.  అందరిలానే వీరు కూడా నెల తిరిగే సరికి జీతాలు అందుకుంటున్నారు.  పాఠశాలకు మాత్రం హాజరుకారు.  ఇలా సమాచారం సేకరించిన లిస్ట్ ను ప్రభుత్వం  వెబ్ సైట్ లో పెట్టింది.  త్వరలోనే వీరిపై చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: