చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ వారు చాలామంది ఉంటారు. కొంతమంది వచ్చి ఇక్కడే స్థిరపడితే ఇంకొంతమంది వచ్చి  ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు.అయితే  తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారన్నది  అందరికీ తెలిసిన విషయమే. తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతి పెద్ద పండుగలలో ఒకటి దసరా. అందుకే దసరా పండక్కి స్కూల్ పిల్లలకి సెలవులు కూడా ఇస్తారు. అయితే హైదరాబాదులో ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు ఇక మిగతా పని మీద వచ్చిన వాళ్ళు దసరా పండక్కి సొంతూర్లకి వెళ్లి  ఫ్యామిలీతో హ్యాపీగా గడిపి... దసరా పండుగ జరుపుకోవాలనుకున్నారు. అందుకే దసరా పండుగ వచ్చిందంటే చాలు నగరాల నుంచి తమ సొంత ఊర్లకు వెళ్లడానికి బారులు తీరుతారు అందరు . ఈ నేపథ్యంలో రైళ్లు బస్సులు అన్ని ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి . 

 

 

 

 

 

 అయితే మామూలుగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటేనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అధిక ధరలతో బెంబేలెత్తిస్తుంటాయి  ప్రయాణికులను . అయితే ఇప్పుడు దసరా పండుగ దృశ్య ప్రయాణీకుల రద్దీ పెరగటంతో  ధరలను భారీగా పెంచాయి. అటు  ట్రైన్ లు,  ఆర్టీసీ బస్సులో ఫుల్లుగా జనాలు ఉండడంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రయాణికుల జేబులకు చిల్లులు పడక తప్పట్లేదు . ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు టికెట్ ధరలు  భారీగా పెంచిన నేపథ్యంలో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. మామూలుగా అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి 350 రూపాయల నుండి 1000 రూపాయల వరకు బస్ టికెట్ ధర ఉంటుంది. 

 

 

 

 

 

 కానీ దసరా పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ పెరగడంతో ప్రైవేటు ట్రావెల్స్ లో ఒక్కసారిగా ధరలు భారీగా  పెంచేశాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆపరేటర్లు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి 1000 రూపాయల నుంచి 3 వేల రూపాయల వరకు ధరను నిర్ణయించి ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఇక ఓ  ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్ అయితే ఏకంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి టికెట్ ధర 7000 వేల రూపాయలు నిర్ణయించాడు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అడ్డగోలుగా రేట్లు పెంచిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రేట్లు భారీగా పెంచినప్పటికీ దసరా పండక్కి ఇంటికి వెళ్లకుండా ఉండలేము కదా... అందుకే భారీ రేట్లను చెల్లించక తప్పలేదు అంటున్నారు ప్రయాణికులు.

మరింత సమాచారం తెలుసుకోండి: