ఏపీలో బీజేపీ రోజు రోజుకు మ‌రింత దీన‌స్థితికి దిగ‌జారిపోతోంది. ఇత‌ర పార్టీల నుంచి వ‌రుస‌గా ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, కీల‌క నాయ‌కులు పార్టీలో చేరుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రింత‌గా పుంజు కోవాల్సిన పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు ప‌డిపోతుండ‌డంతో అధిష్టానం ఆశ‌లు అడియాశ‌ల‌వుతున్నాయి. గతంలో సిన్సియర్ గా పార్టీ కోసం పనిచేసిన సీనియ‌ర్ నేతలు ఇప్పుడు దూరం జరిగారు. ప్ర‌స్తుతం ఏపీ బీజేపీలో సిద్ధాంతాలు లేని వాళ్లు.. ఆర్థికంగా నేరాలు చేసి..బ్యాంకుల‌కు కోట్లాది రూపాయ‌లు ఎగ్గొట్టిన వారు త‌మ కేసుల నుంచి విముక్తి కోస‌మే బీజేపీలో చేరుతున్నారు.


ఒక‌ప్పుడు బీజేపీలో ఉన్న నేతలంతే సిద్ధాంతాలు... ఆర్ఎస్ఎస్ భావ‌జాలం ఉన్న వాళ్లు మాత్ర‌మే ఉండేవారు. ఇప్పుడు బీజేపీ ఆర్థిక నేర‌గాళ్ల అడ్డాగా మారిపోయింది. ఈ విష‌యం పార్టీ అధిష్టానానికి తెలిసినా ఏం చేయ‌లేని ప‌రిస్థితి. ఎంతమందిని చేర్చుకున్నా పరువు పోగొట్టుకోవడం మినహా పార్టీకి రాష్ట్రంలో పెద్దగా ఒరిగేదిలేదని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  ఈనే ప‌థ్యంలో తమ ఆ వేదనను ఓ కీలకనేత సంఘ్ పరివార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.


ఇటీవల కాలంలో సుజనాచౌదరి, సీఎం రమేశ్‌, ఆదినారాయణరెడ్డి (ఇంకా చేరాల్సి ఉంది) లాంటి వారిని పార్టీలో చేర్చుకోవడంపై కమలనాధుల్లోనే కలవరం మొదలయింది. పార్టీ ఏ స్థాయికి దిగజారిందన్న వ్యాఖ్యలు వారినోటి నుంచే విన్పిస్తున్నాయి. ఏపీలో బీజేపీకి ముందు నుంచే సీన్ లేదు. ఇక్క‌డ మోదీని, అమిత్ షాను చూసి ఓట్లేసే వారు ఎవ్వ‌రు లేరు. మ‌రో వైపు వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది.


ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పెద్దగా అవకాశాలు లేవు. ఎక్కడో కేంద్రంలో ఉన్న మోదీని, అమిత్ షాను చూసి ఇక్కడ ఓట్లేసే పరిస్థితి లేదు. గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎదిగేందుకు ప్రయ త్నిస్తున్నా అది జరగలేదు. గత ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. కనీసం ఒక్క స్థానంలో గెల వలేకపోవడం, నోటా కంటే ఓట్లు తక్కువగా రావడం కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితిని చెప్పకనే తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: