గ్రామ స్వరాజ్య పాలనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏపీకి బ్రాండ్ ఇమేజ్ కల్పించే పనిలో పడింది. ప్రజలకు పారదర్శకమైన పాలనను అందించే క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చింది. మరి కొన్ని వినూత్న మార్పులకు సమాయత్తమవుతోంది. ఇదే క్రమంలో జగన్ సర్కారు తాజాగా  పారిశ్రామికాభివృద్ధిపై దృష్ఠి పెట్టింది. ఈ నేపథ్యంలో నూతన పారిశ్రామిక విధానం తీసుకురావాలని జగన్ సర్కారు  భావిస్తున్నట్టు సమాచారం. 13 జిల్లాల్లో ప్రత్యేక పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.



ముందుగా రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసేందుకు నడుంబిగించింది. ఇందులో భాగంగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలోఏపి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పివి రమేష్‌, సెక్రటరీ రజత భార్గవ్‌లు  పాల్గొన్నారు. పారిశ్రామిక రంగం అభివృద్ధి, పెట్టుబడులకు ప్రోత్సాహంపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఏపికి బ్రాండ్‌ ఇమేజ్‌ రూపొందించే పనిలో తమ శాఖ ఉందని మంత్రి మేకపాటి తెలిపారు. తొలుత ఏపి బ్రాండ్‌ థాన్‌ పోస్టర్‌ను మంత్రి గౌతం రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సదస్సు ద్వారా బ్రాండ్‌ ఏపిని తయారు చేయడానికి సలహాలు, సూచనలు ఆహ్వానించామని చెప్పారు.




పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా బిల్డింగ్‌ బ్రాండ్‌ ఏపి కోసం ''ఏపి బ్రాండ్‌ థాన్‌'' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అక్టోబర్ 3 వ తేదీ  నుంచి అక్టోబర్‌ 28 రాత్రి 11 గంటల వరకు బిల్డింగ్‌ బ్రాండ్‌ ఏపి కోసం వెబ్‌ పోర్టల్‌లో ఇందుకు అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు..ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ లోగో, ట్యాగ్‌లైన్‌పై యువత నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నామని మంత్రి గౌతం రెడ్డి పేర్కొన్నారు. అత్యున్నతమైన మూడు ఎంట్రీలకు నగదు పురస్కారాలు అందజేస్తామన్నారు. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.25 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: