ప్రతి ఒక్కరూ పర్స్ వాడుతూంటారు. మరికొందరు వాలెట్స్ కూడా ఉపయోగిస్తూంటారు. అయితే వీటిని ఒక్కోసారి పోగొట్టుకుంటూంటాం. ఇవి ఒక్కోసారి దొంగతనానికి కూడా గురికావొచ్చు. వీటిలో నగదతుపాటు డెబిట్, క్రెడిట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఆధార్ కార్డులు.. వంటివి ఉంటూంటాయి. ఆ సమయాల్లో చాలామంది అనుకునే మాట డబ్బులు పోతే పర్లేదు.. కార్డులైనా దొరికితే చాలు అని. ఇలాంటి సందర్భాల్లో పర్సు తిరిగి దొరక్కపోగా ముఖ్యమైన కార్డులను పోగొట్టుకుంటే వచ్చే నష్టమే ఎక్కువ.



చేసేది లేక వెంటనే ఆయా బ్యంకుల కాల్ సెంటర్లకు కాల్ చేసి కార్డులను బ్లాక్ చేయిస్తాం. మరలా ఆ కార్డులు పొందడానికి సమయం పడుతుంది. ఈలోపు మన రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతూంటాయి. మన దేశంలో అయితే ఎలాగోలా కార్డులను మళ్లీ పొందుతాం.. అదే విదేశాల్లో పోగొట్టుకుంటే సమస్యలు ఎదురవుతాయి. ఇటువంటి సమస్యలకు ఇప్పుడో కొత్త పరిష్కారం చూపిస్తోంది బజాజ్ కంపెనీ. బజాజ్ ఫిన్‌ సర్వ్‌కు చెందిన బజాజ్ ఫైనాన్స్ వాలెట్ కేర్ పేరుతో సరికొత్త సర్వీస్ లాంచ్ చేసింది.బజాజ్ వాలెట్ కేర్ సేవలతో మీ వాలెట్‌కు ప్రొటెక్షన్ కల్పిస్తోంది. రూ.599 తో ఈ వాలెట్ కేర్ ప్లాన్ తీసుకోవాలి. పర్స్ పోయిన సందర్భాల్లో దీనిపై రూ.2 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. అంతే కాకుండా ఈ ప్లాన్ లో ట్రావెల, హోటల్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలను కూడా కల్పిస్తోంది.



ఇవే కాకుండా.. కార్డు పిన్ ఆధారిత మోసాలు, ఫిషింగ్, టెలీ ఫిషింగ్ రూపంలో మోసాలు జరిగి నష్టం వాటిల్లితే రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. కార్డు ద్వారా జరిగే మోసాలకు రూ.లక్ష వరకు కవరేజ్ లభిస్తుంది. 18 ఏళ్లకుపైన వయసు కలిగిన వారు ఈ వాలెట్ కేర్ ప్లాన్ తీసుకోవడానికి అర్హులు. ప్లాన్ వాలిడిటీ పరిధి ఏడాది వరకూ ఉంటుంది. అంతేకాకుండా వాలెట్‌లోని పాన్ కార్డుతో సహా పలు కీలకమైన ఐడెంటిటీ ప్రూఫ్స్‌ను రిప్లేస్‌మెంట్ పొందొచ్చు. వాలెట్ కేర్ ప్లాన్ తీసుకుంటే పర్స్ పోయినప్పుడు బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను వెంటనే బ్లాక్ చేయొచ్చు. పర్స్ పోయిన రోజులో ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా సంబంధిత హెల్ప్ లైన్‌ కు కాల్ చేసి విషయం చెప్తే, కార్డులను బ్లాక్ చేస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: