పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) విషయమై భారత్ మరియు పాక్ మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి. కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాని తరువాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై పాక్ దేశం జీర్ణించుకోలేక, ఈ అంశాన్ని ఐక్యరాజసమితి సమావేశంలో బయటపెట్టి, చైనా సహకారంతో మనల్ని ఇబ్బందులకు గురిచేయాలని చూసినప్పటికీ, 

చైనా తోపాటు బ్రిటన్ మినహా మిగిలిన అన్ని ఇతర దేశాల వారు, కాశ్మీర్ అంశంపై భారత్ నిర్ణయాన్ని సమర్ధించడం జరిగింది. అయితే అగ్రదేశమైన అమెరికా మాత్రం ఈ విషయమై కొంత తటస్థంగా వ్యవహరించగా, రష్యా వంటి మరొక అగ్ర దేశం మన దేశ నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించడం జరిగింది. అంతేకాదు పలు ఇస్లాం దేశాలైన యుఏఈ, బహ్రెయిన్ దేశాలు కూడా ఈ విషయమై మనకే మద్దతు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఆర్టికల్ 370 అంశం రద్దు అనేది మన దేశ అంతర్గత వ్యవహారం అనే విషయం తెలిసి కూడా, అందులో పాక్ తలదూర్చి, మనపై అసందర్భ ప్రేలాపనలు పేలడంతో, పలు దేశాల నుండి అక్షింతలు కూడా వేయిచుకోవడం జరిగింది. అయినా వారి కుటిల బుద్ధి మాత్రం మారడం లేదు. మరోవైపు పీవోకే ను స్వాధీనం చేసుకునేలా కుటిల చర్యలు చేపడుతోందట. 

ఇకపోతే నేడు కొన్ని నిఘా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ వారంలో పీవోకే నియంత్రణ రేఖ వద్ద పర్యటించనున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తతో వెంటనే అప్రమత్తమైన భారత దళాలు, నియంత్రణ రేఖ వద్ద మరింత గట్టిగా భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు భారీ అలజడి మరియు విధ్వంసం సృష్టించేందుకు కుటిల పన్నాగం పన్నుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. అందుకే అక్కడి ప్రాంతాలను మన ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రతను నేడు ఏర్పాతు చేయనుందట.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: