మాజీ ప్రధాని మన్మోహన్  పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. నవంబర్‌లో కర్తార్ పూర్‌లో జరుగనున్న గురునానక్ 550వ జయంతి వేడుకలకు హాజరుకానున్నారు. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలన్న పాక్ మంత్రి విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఆయన...  పంజాబ్ సీఎం కోరిక మేరకు గురుద్వారకు వెళ్లేందుకు అంగీకరించారు.   


మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకొని... కర్తార్ పూర్ లో ఉన్న దర్బార్ సాహిబ్ కు  వెళ్లనున్నారు. గురుద్వారను సందర్శించే తొలి యాత్రికుల బ్యాచ్‌ తో కలిసి నవంబర్‌ 9న మన్మోహన్ అక్కడకు వెళ్లనున్నారు.


చారిత్రక కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు... తమదేశానికి రావాల్సిందిగా కొద్దిరోజుల కిందట పాక్ విదేశాంగ మంత్రి విజ్ఞప్తి చేయగా మన్మోహన్ తోసిపుచ్చారు. అయితే పంజాబ్ సీఎం  అమరీందర్ సింగ్ ఆహ్వానం మేరకు  మన్మోహన్ నేతృత్వంలో వచ్చే నెల 9న అఖిలపక్ష బృందం కర్తార్ పూర్ కు వెళ్తుంది.  భారత్-పాకిస్థాన్ మధ్య వారధిలా భావిస్తోన్న కర్తార్ పూర్ లో... సిక్కుల తొలి గురువు గురునానక్ వెలిశారు. ఆయన 550వ  జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఈ సందర్భంగా కర్తార్ పూర్ వెళ్లే విషయంలో... అమరీందర్ సింగ్  ఢిల్లీలో మన్మోహన్ సింగ్ తో భేటీ అయ్యారు. అదే విధంగా రాష్ట్రపతి, ప్రధానులను కూడా గురునానక్ జయంతి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు అమరీందర్ సింగ్   

మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా వ్యవహరించిన పదేళ్లలో పాకిస్థాన్ ను ఒక్కసారి కూడా సందర్శించలేదు. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పంజాబ్‌ ప్రావియన్స్‌లోని  ప్రాంతంలోనే మన్మోహన్‌ జన్మించారు. దేశ విభజన తర్వాత మన్మోహన్  కుటుంబం అమృత్‌సర్‌కు తరలివచ్చింది.  మొత్తానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే కశ్మీర్ అంశంపై భారత్. పాక్ ల మధ్య వాడీవేడిగా మాటల యుద్ధం జరుగుతుండటంతో.. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ప్రధాని పాక్ పర్యటన ఆసక్తిరేపుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: