తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ప్రధాన నిందితురాలు దేవికారాణిపై ప్రభుత్వ వేటు వేసింది.దేవికారాణిను ఈఎస్ఐ డైరెక్టర్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురిపై ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. జాయింట్ డైరెక్టర్ పద్మ, వసంత రాధిక, హర్ష వర్ధన్ పై వేటు వేసింది ప్రభుత్వం. ఇక దేవికారాణి స్థానంలో ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్ కొత్త డైరెక్టర్ గా అహ్మద్ ను నియమించారు.

ఇక అసలు విషయానికి వస్తే ఏసీబీ దర్యాప్తులో ఈఎస్ఐ ఐఎమ్ ఎస్ కేసు అక్రమాలు చాల  బయటపడుతున్నాయి. ప్రధానంగా ఐఎస్ ఐ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన దేవికారాణి 2014 నుంచి 2018 వరకు దాదాపు రూ.1000 కోట్ల వరకు ఈఎస్ ఐలో మందుల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు దానికి దగ్గ అధారాలు సేకరించారు. ఏడాదికి సుమారు రూ.250 కోట్ల మందుల కొనుగోళ్లు జరిగినట్లు ఏసీబీకి అధారాలు లభించింది . మందుల కొనుగోళ్లకు సంబంధించి ఏసీబీ ఆధారాలు, డాక్యుమెంట్లు సెకరణ జరిగింది.

ఈఎస్‌ఐ విభాగంలోని సిబ్బంది, అధికారులతో పాటు ప్రైవేట్‌ వ్యక్తులు కుమ్మక్కై భారీగా దోచుకున్నట్లు ఏసీబీ నిర్ధారించింది. దర్యాప్తు ముమ్మరం చేసింది. గత నాలుగేళ్లుగా ఏడాది రూ.250 కోట్ల చొప్పున దాదాపు వెయ్యి కోట్ల రూపాయిల మెడిసిన్‌ కొనుగోళ్లు చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 డిస్పెన్సరీల దగ్గర ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్టు చేశారు.

 మరికొందరు మీద అనుమానం ఉన్న వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పలు మెడికల్ ఏజెన్సీల ఆఫీసుల్లోనూ ఏసీబీ సోదాలు జరుపుతోంది. నిన్న ఓమ్ని మైడ్ ఉద్యోగి నాగరాజు ఇంట్లో దొరికిన 46 కోట్ల నకిలీ ఇండెంట్ల ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: