తాజాగా తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. గత ఎలక్షన్ల  నుంచి బిజెపి తో అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు కేసీఆర్. గత ఎలక్షన్ లో బిజెపి ని ఓడించేందుకు ఫెడరల్ ఫ్రెంట్  ఏర్పాటు కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు కూడా. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత కేసీఆర్ దేశ ప్రధాని మోడీ తో భేటీ  ఆసక్తికరంగా మారింది. అయితే దేశంలో ఆర్థిక మాంద్యం దృశ్య తెలంగాణ రాష్ట్ర పరిస్థితి దెబ్బ తినడం వల్ల కేంద్రాన్ని ఆర్థికసాయం కోరడానికి కేసీఆర్ మోడీతో భేటీ అవుతున్నారని సమాచారం . 

 

 

 

 

 అయితే 11 గంటల 30 నిమిషాలకు మోడీతో భేటీ కలవాల్సిన కేసీఆర్  షెడ్యూల్ లో మార్పు వల్ల  ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. నార్త్ బ్లాక్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో బేటి అయిన కేసీఆర్  దాదాపు 40 నిమిషాల పాటు  సుదీర్ఘంగా చర్చించారు. అయితే నేడు 4 గంటల 30 నిమిషాలకు కెసిఆర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే  తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి నదుల అనుసంధానంపై చర్చించగా... ఉమ్మడి ప్రాజెక్టు కోసం మోదీని కెసిఆర్ సాయం కోరినున్నట్లు  సమాచారం. 

 

 

 

 

 అలాగే కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, మెట్రో రెండో దశ పనులకు నిధుల కేటాయింపు, నల్లమలలో యురేనియం తవ్వకాలు సహా పలు అంశాలపై కెసిఆర్ మోడీ తో చర్చించనున్నారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర బడ్జెట్ తోనే నిర్వహిస్తున్న మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాల నిర్వహణకు  కూడా కేంద్రం సాయం కోరనున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్. కాగా దాదాపు తొమ్మిది నెలల తర్వాత కెసిఆర్ మోదీ తో సమావేశం అవ్వటం  చర్చనీయాంశంగా మారింది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాజకీయం  తెలంగాణలో నడుస్తున్న  వేళ కేసీఆర్ ప్రధాని మోడీ తో భేటీ అయ్యి  కేంద్రం నుండి ఏదైనా హామీ ని  సాధిస్తే అది హుజూర్   నగర్ ఉప ఎన్నికలపై పడే అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి: