కాళ్ళు చేతులు అన్ని సరిగా ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా... జీవితాలను నిర్లక్ష్యం చేసుకుంటూ.. సమయాన్ని వృధా చేసుకుంటున్నారు.  ఫలితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని ఎంతో మంది ఎన్నోసార్లు నిరూపించారు.  ఇప్పయిటీకి నిరూపిస్తూనే ఉన్నారు.  ఈ చిన్నారి జీవితం గురించి తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి.  ఆ చిన్నారి వయసు కేవలం 9 సంవత్సరాలు.  పుట్టిన క్షణంలోనే మోకాళ్ళ కిందభాగం ఎముకలు సరిగా ఎదగకపోవడంతో మోకాళ్ళ కింద భాగం లేకుండానే జన్మించింది.  


ఆ చిన్నారిని చూసి తండ్రి షాక్ అయ్యాడు.  ఎలా ఎదుగుతుందో.. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అని భయపడ్డాడు.  నిరంతరంగా చిన్నారి గురించి అలోచించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ బాధనుంచి బయటపడేందుకు మద్యానికి బానిసయ్యాడు.  ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.  చిన్నారి గుర్తుకు వచ్చి విరమించుకున్నాడట ఆ తండ్రి.  


తన గురించి తండ్రి పడుతున్న బాధను, కష్టాన్ని అర్ధం చేసుకున్న ఆ చిన్నారి, తనను తాను నిరూపించుకోవాలని అనుకుంది.  కాళ్ళు లేకున్నా.. కృత్రిమ కళ్ళను ధరించి ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది.  ఫ్యషన్ గా బట్టలు వేసుకోవడం.. ఫ్యాషనబుల్ గా తలను దువ్వుకోవడం వంటివి చేస్తుండటంతో... అది గమనించిన తండ్రి ఆ చిన్నారి డైసీని ఫ్యాషన్ రంగానికి పరిచయం చేశారు.  


చిన్నపిల్లలా ఫ్యాషన్ దుస్తులను ధరించి మోడల్ గా ఎదిగింది.  9 సంవసరాల వయసులోనే ప్యారిస్ ఫ్యాషన్ వీక్ 2019లో మెరుపులు మెరిపించింది.  న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో బెస్ట్ గా నిలిచింది.  ఆమె జీవితం గురించి తెలుసుకున్న చాలా కంపెనీలు తమ దుస్తులకు మోడల్ గా నియమించుకుంటున్నాయి.  తనకు భారం అవుతుంది అనుకున్న చిన్నారి.. కుటుంబానికి ఆసరాగా నిలవడం విశేషం.   ఈచిన్నారి గురించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: