ఇటీవల ఏపీ సీఎం జగన్ తిరుమల తిరుపతి దేవస్థానికి పట్టుస్త్రాలు సమర్పించారు అని అందరికి తెలిసిందే కదా.కానీ ఈ విషయం పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఓ క్రిస్టియన్.. తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలిస్తారా అని ?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతే కాదు తిరుమల ఆలయ కమిటీ వారు  డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అని చంద్రబాబు  పేర్కొంటున్నారు. తిరుమల ఆలయంలో ప్రవేశానికి అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారు. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సైతం డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. క్రిస్టియన్‌గా చెప్పుకుంటున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టుస్త్రాలు సమర్పించారని, ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదని  కూడా ఆరోపణలు చేశారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి కంటే జగన్ అతీతుడా అని కూడా చంద్రబాబు  ప్రశ్నించారు. శ్రీవారి పింక్ డైమండ్ తన ఇంట్లో ఉందన్నారని, ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి అసలు డైమండ్ అనేదే లేదంటున్నారని,నిజానికి  పింక్ డైమండ్ ఎక్కడుందో ప్రభుత్వమే సమాధానం ఇవ్వాలని  చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పోస్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్  కూడా ఇచ్చారు. తనపై, పార్టీ నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

కేవలం లక్ష రూపాయలు విలువ చేసే అసెంబ్లీ ఫర్నిచర్‌ కోసం మాజీ స్పీకర్‌కు కోడెల శివప్రసాదరావును క్షోభకు గురిచేశారని, ఆయన ఆత్మహత్యకు కారణం అయ్యారు అని మంది పడ్డారు. వేల కోట్లు దోచుకున్న ఈ సీఎం జగన్‌ని ఏంచేయాలని ఆయన ప్రశ్నించడం కొనసాగించాడు . ఇలాంటి పోస్టులు వారి కుటుంబ సభ్యులపై పెడితే ఊరుకుంటారా? అసలు వారిని వదిలిపెడతారా? అని ప్రశ్నించారు.

టీడీపీ కార్యకర్తలు సాధారణ పోస్టులు పెట్టినా అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తున్నారని చంద్ర బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు కేసులతో ఇబ్బందులకు గురైన టీడీపీ సానుభూతిపరులతో ప్రత్యక్షంగా మాట్లాడించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీపై పెట్టిన ప్రతి పోస్టును డీజీపీకి ఇచ్చామని, అయినా చర్యలు తీసుకోలేదన్నారు. తెలుగుదేశం ఫిర్యాదులు డీజీపీకి ఎందుకు కనిపించడంలేదని చంద్రబాబు ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమేనని, ఎవరినీ వదిలిపెట్టమంటూ హెచ్చరికలు చేశారు. ఒక మాజీ డీజీపీపై అసభ్య పోస్టు పెడితే ప్రస్తుత డీజీపీకి, పోలీసులకు రోషం లేదా? అని చంద్రబాబు నిలదీశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: