చంద్రబాబు  సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై పెట్టిన  పోస్టులను చూసి చాల ఆగ్రహం చూపుతున్నారు. ఆ అసభ్యకర పోస్టులు ఆంటీని ప్రజెంటేషన్‌ రూపంలో  మీడియాకు చూపించారు చంద్రబాబు. ఇవి ఇంకా కొన్నిమాత్రమేనని, వాళ్లు చేసిన పోస్టులు అన్ని  డీజీపీకి ఇచ్చామన్నారు. కానీ డీజీపీకి అవేమీ కనిపించడంలేదని ధ్వజమెత్తారు చంద్రబాబు.

ఇక అసలు విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపైనా, తన పార్టీ నేతలపై చేస్తున్న ప్రచారం దారుణంలో అతి దారుణం అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. స్వర్గస్తులైన నారా చంద్రబాబునాయుడు అంటూ పోస్టు కూడా  చేశారని, నువ్వు ఎన్ని లుచ్ఛా పనులు చేసినా, పైకి పోయావు కాబట్టి సానుభూతి ప్రదర్శిస్తున్నాం, జోహార్ చంద్రబాబు అంటూ కామెంట్ కూడా పెట్టారని బాగా మండి పడుతున్నారు.

రాజకీయాల్లో ఉన్నది ఇలాంటి వెధవ పనులు, వెధవ మాటలు వినడానికా? అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇక ఏ పోస్టలుకు సంబంధించి సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై చంద్రబాబు గురువారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ ఆంబోతులు ఓ నేరచరిత కలిగిన వ్యక్తిని అడ్డంపెట్టుకుని ఏంచేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసన్నారు.

మాచర్లలో ఓ మహిళ తన కాళ్లు పట్టుకుని గోడు వెళ్లబోసుకున్న ఘటనను వ్యంగ్యంగా మార్చేశారని కూడా ఆరోపణలు చేశారు. బాధిత మహిళ స్థానంలో లోకేష్ ముఖాన్ని మార్ఫింగ్ చేసిన క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు. లోకేశ్ తన కాళ్లు పట్టుకోవడానికి రాగా, ఎక్కడో చూసినట్టుంది ఈమెను అంటూ తాను అడిగినట్టు, ఫిమేల్ ఆర్టిస్టులు ఎవరూ రాలేదు నాన్నారూ, నేనే చీరకట్టుకుని వచ్చా అంటూ లోకేశ్ చెప్పినట్టు చిత్రీకరించారని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా ఒకటి కాదు రెండు కాదు చాల విచిత్రమైన పోస్టులను పెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: