మన ఆంధ్ర ప్రదేశ్ లో అనంతపురం జిల్లా ఎస్పీని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. ఎస్పీతో పాత  కేసులుకు సంబంధించిన అంశాలపై చర్చ కొనసాగించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు తెలియచేసారు.

ప్రస్తుతం అనంతపురం జిల్లా ఎస్పీగా సత్య ఏసుబాబు విధులు నిర్వర్తిస్తున్నారు.అనంతపురంకి  ఎస్పీగా సత్య ఏసుబాబు  ఉన్నంతకాలం టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కేడర్ మొత్తం బాగుంటుందని వ్యాఖ్యలు తెలిపారు. ఒకవేళ అనంతపురం జల్లా ఎస్సీగా సత్య ఏసుబాబు లేకుంటే టీడీపీ కార్యకర్తలు అసలు  గ్రామాల్లో కూడా ఉండలేని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు ప్రభాకర్ రెడ్డి. 

ఇక టీడీపీ కార్యకర్తలంతా సొంత ఊళ్లు వదిలిపెట్టి వెళ్లడం ఖాయం అని తెలిపారు. పాతకేసులకు సంబంధించి స్థానికంగా పోలీసులు స్పందించడం లేదని.. ఆ విషయమే ఎస్పీతో మాట్లాడేందుకు వచ్చినట్లు ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఎస్పీపై పొగడ్తలు కురిపించగానే తాము పార్టీ మారతామని అనుకుంటే చాల పెద్ద పొరపాటు అన్నారు జేసీ. 'మంచి ఉంటే మంచి చెబుతాం.. చెడ్డ ఉంటే చెడ్డ చెబుతాం. దీనికే పార్టీ మారతారని ప్రచారం చేయడం ఆ మాత్రం సరికాదు అని తెలియచేసారు. ఇక ఇప్పుడు మాత్రం ఎస్పీని కలిసి తమ సమస్యల్ని  చెప్పుకున్నం అని తెలిపారు  ప్రభాకర్ రెడ్డి.

ఇక గతంలో కూడా ప్రభాకర్ రెడ్డి  సత్య ఏసుబాబు పనితీరును చాల మెచ్చుకున్నారు. ప్రజలకు ఉన్న సమస్యలపై ఎస్పీ బాగా స్పందిస్తున్నారని.. పార్టీలకు అతీతంగా పని చేస్తున్నారని కూడా  వ్యాఖ్యానించారు. ఇక ఎస్పీపై జేసీ ప్రశంసలు ఇప్పుడు జిల్లాలో పెద్ద హాట్‌టాపిక్ మారింది. అంతేకాదు ఒకవేళ జిల్లా ఎస్పీని బదిలీ చేస్తే పరిస్థితి ఏంటనే చర్చ కూడా  జరుగుతోంది అని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: