తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి  దీనస్థితిలో ఉందని... తమకు సరైన జీతాలు అందక తమ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉందని ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి  తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే అధికారంలోకి రాకముందు ఆర్టీసీ కార్మికులకు మేలు చేకూర్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన కేసీఆర్... అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆర్టీసీ కార్మికులను విస్మరించారు. ఎన్నో  రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరినప్పటికీ ప్రభుత్వం మాత్రం సరైన రీతిలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై స్పందించలేదు. 

 

 

 

 

 అయితే ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 5 నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగిస్తామని టీఎస్ ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో దిగివచ్చిన రాష్ట్రప్రభుత్వం ఆర్ టి సి కార్మికులతో చర్చలు జరిపింది. అయితే ఆర్టీసీ కార్మికులతో  ఐఏఎస్ ల  కమిటీ ఈరోజు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 

 

 

 

 

 ఆర్టీసీ కార్మికులకు ఐఏఎస్ ల  కమిటీకి జరిగిన చర్చలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ఐఏఎస్ ల  కమిటీ అంగీకరించకపోవడంతో రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ  కార్మికులు స్పష్టం చేసారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పేశారు. ఈరోజు రాత్రి 12:00 నుంచి సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తెలిపారు . అయితే ప్రభుత్వం ఇప్పటికే దసరా కి ప్రత్యేక బస్సులు నడుపుతామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెతో ప్రత్యేక బస్సులు దేవుడెరుగు ఉన్న బస్సులకే  దిక్కు లేకుండా పోయిందే అంటూ  ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. 

 

 

 

 

 

 అటు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ధరలు కట్టలేక... ఇటు రైళ్లలో చిన్న చిన్న సందుల్లో ఇరకలేక... కాస్త తక్కువ ఖర్చుతో ఆర్టీసీ బుస్సుల్లో  వెళ్ళాలనుకుంటే ఆర్టీసీ సమ్మెతో పెద్ద షాక్ తగిలింది అంటున్నారు ప్రయాణికులు. ఇంకేం చేస్తాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో ధరలు తో జేబులకు చిల్లులు పడుతుందని తెలిసినప్పటికీ  ఇప్పుడు అవే దిక్కయ్యాయి అని ప్రయాణికులు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: