తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఐఏఎస్ కమిటీకి ఆర్టీసీ కార్మికులకు   జరిగిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5 నుంచి ఆర్టీసీ సమ్మె దిగుతామని స్పష్టం చేశారు. అయితే దసరా పండుగ ఇంకా వారం రోజులు కూడా లేకపోవడంతో... హైదరాబాద్ నగరానికి వివిధ పనులపై వచ్చిన ప్రజలందరూ దసరా పండుగ కి ఊళ్ళకి  బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులే  కాకుండా అటు ట్రైన్లు ఇటు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కూడా ప్రయాణికుల రద్దీ తో కిటకిటలాడుతున్నాయి. 

 

 

 

 

 

 ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగించడంతో ప్రయాణికులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధరలు భారీగా పెంచిన వేళ ఆర్టీసీ సమ్మె కూడా రావడంతో తమ జేబుకు చిల్లు పడడం కాయమని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పేసారు. దీంతో ప్రస్తుతం ప్రయాణీకుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే అధిక ధరలు చెల్లించి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో వెళ్లాలేక...  ఇటు ఆర్టిసి బస్సు లో వెళ్దామ్  అంటే సమ్మె కారణంగా బస్సులు నడవక  అయోమయంలో  పడ్డారు కార్మికులు . 

 

 

 

 

 

 అయితే ఓ వైపు తమ కష్టాలను తీర్చాలంటూ  ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తుంటే... మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు చూపు మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ పై  పడడంతో వాళ్ళు  భారీగా రేట్లు పెంచేందుకు యోచిస్తున్నారు. ఇది కదా ప్రైవేట్ ట్రావెల్స్ లకు అసలైన దసరా పండుగ ప్రైవేట్ ట్రావెల్స్ అని యాజమాన్యాలు  భావిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి మాత్రం ఓవైపు ఆర్టీసీ కార్మికుల కష్టం... మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల సంబరం అన్నట్లుగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: