కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే వార్త ఎంత ప్రభంజనాన్ని సృష్టించిందో నిక్కర్లు తొడుక్కునే బుడ్డోడి నుండి పాడే ఎక్కే ముసలోడి వరకు చెబుతారు కాని తెలంగాణ ఆర్టీసీ ఇంతలా ఎందుకు నష్టాల్లో వుంది ? మన ప్రభుత్వం ఏం చేస్తుంది ? ప్రయాణికుల భద్రత అంటే ఇదేనా ? అనే గుట్టు మాత్రం చెప్పడం ఎవ్వరి తరం కాదు.ఇప్పుడున్న పరిస్ధితిలో ఆర్టీసీ భవితం గాల్లో ఆడుతున్న దీపంలా ఉంది.ఈ సమయంలో ప్రయాణికుల కోసం ఆలోచించే వారే లేరా అని ధీనంగా దిక్కులు చూసే స్ధితికి చేరారు. ప్రయాణికులు.ప్రైవేట్ బస్సులు ఇప్పుడు వసూలు చేస్తున్న ధరలను చూస్తే దిమ్మ తిరగడం ఖాయం.వారికి వచ్చే ఫ్రాఫిట్‌తో మరో కొత్త బస్సు కొంటారేమో అనేంతలా కాసులు రాలుతాయి.



ఇక ఉడుం పట్టు పట్టిన ఆర్టీసీ కార్మిక సంఘాలు,శుక్రవారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని,సమ్మె విషయంలో వెనక్కు తగ్గేది లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.ప్రభుత్వానికి కార్మికుల సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేదని. అధికారులు ఏం చెప్పే పరిస్థితిలో లేరన్నారు.తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు చాలా కష్టపడ్డ విషయాన్ని మర్చిపోకూడద న్నారు.ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని..తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రివర్గ ఉపసంఘం సూచించిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు.



ఇది వరకు సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు 20 రోజులు పోరాడిన విషయాన్ని గుర్తుచేశారు.ఇక ఇప్పుడు చేస్తున్న సమ్మెతో తెలంగాణా ఆర్టీసీ లాభపడదు,ప్రయాణం చేసే ప్రయాణికులకు లాభంలేదు.మధ్యలో కోతి కొబ్బరిచిప్ప కధలా ప్రైవేట్ బస్సుల యజామానులకు మాత్రం కాసుల గలగలలే.కాని ప్రయాణికుల జేబులకు మామూలు చిల్లులు కాదు.ఈ పండగకు చార్జీల రూపం లో పెట్టే ఖర్చులతో ఒకనెల సామాన్యుడు హ్యపీగా బ్రతకవచ్చు.ఒకరకంగా సమ్మె ప్రభావం ప్రయాణికులకు కొత్త కష్టాల్లో పడేసిందని చెప్పవచ్చూ,ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచే నిలిపివేయడం తో ప్రయాణికుల ఇబ్బందులు చెప్పతరం అవ్వడంలేదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుందో వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: