తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఇక రాష్ట్రమంతా నిండుగా తిరిగే బస్సుల అని డిపోలకే పరిమితం కానున్నాయి . అయితే మామూలు రోజుల్లో నే  ఆర్టీసీ సమ్మె జరిగితే  ప్రయాణికుల ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. కాగా ఇప్పుడు దసరా సీజన్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కు ప్రభుత్వం స్పందిస్తుందో లేదో తెలియదు కానీ... ఈ సమ్మెతో ప్రైవేటు వాహనాలదారులు  మాత్రం పండగ చేసుకుంటున్నారు. 

 

 

 ఎందుకంటే ఆర్టీసీ సమ్మెతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో... ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక  తప్పేలా లేదూ. దీంతో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నన్ని  రోజులు  ప్రవేట్ వాహనదారులు రాజ్యమే  నడుస్తుంది కదా. అందుకే ఇష్టారీతిన ధరలు  పెంచేస్తూ ప్రయాణికులను దోచుకోవడానికి ప్రైవేట్ వాహనదారులు సిద్ధమయ్యారు. ఆర్టీసీ సమ్మె కొనసాగినన్ని  రోజులు ... భలే మంచి రోజు పసందైన రోజు అంటూ ప్రయాణికుల నుంచి భారీగా డబ్బులు  దండుకోవడానికి సిద్ధమయ్యారు. 

 

 

 అయితే రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తుండటం తో   భలే మంచి క్లాసు బేరం దొరికిందే  అంటూ ప్రవేట్ వాహన దారులు  సంబరపడుతున్నారు. ఇంకేముంది జోబులు  నింపుకొని సంబరాలు చేసుకునేందుకు ప్రైవేటు వాహనదారులు  సిద్ధమయ్యారు. ఏదేమైనా వాహనదారులకు మాత్రం ఆర్టీసీ సమ్మెతో జేబుకు చిల్లు పడక తప్పేలా లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: