పులి బ‌క్క‌దైతే దాని చారిక‌లు బ‌క్క‌గా అవుతాయా... అనేది సామేత ఇప్పుడు జ‌న‌సేన ప‌రిస్థితి అలాగే ఉంది.  వ‌సుదేవుడంతి వాడే గాడిద కాళ్ళు ప‌ట్టుకున్నాడ‌నేది మ‌రో సామేత ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప‌రిస్థితి.   ఏపీలో కాంగ్రెస్‌కు బ‌ద్ద వ్య‌తిరేకి అయిన జ‌న‌సేన పార్టీని తెలంగాణ కాంగ్రెస్ పెద్ద‌లు మాత్రం త‌మ‌కు స‌పోర్టు ఇవ్వాల‌ని యాచిస్తున్నారు. జ‌న‌సేన‌కు ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేవలం చ‌చ్చిచెడి ఒకే ఒక్క అసెంబ్లీ సీటు  గెలిచింది. పార్టీ ర‌థ‌సార‌దే రెండు చోట్ల ఓడిపోయి కుక్క‌చావు చ‌చ్చాడు. అయితే ఇప్పుడు క‌నీసం త‌న సీటును తానే గెలుచుకోలేని పార్టీతో ఇప్పుడు పొత్తు కోసం అర్రులు చాస్తుంది కాంగ్రెస్‌.


గ‌త‌మెంతో ఘ‌న‌కీర్తి అన్న‌ట్లుగా కాంగ్రెస్ ఒక‌ప్పుడు జాతీయ‌స్థాయిలో తిరుగులేని పార్టీ.. కానీ ఇప్పుడు దాని ప‌రిస్థితి ప్రాంతీయ పార్టీక‌న్నా హీనంగా త‌యారైంది. హీన ద‌శ‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అతిహీన స్థితిలో ఉండి రేపోమాపో దుకాణం మూసుకునేందుకు సిద్ధంగా ఉన్న జ‌న‌సేన పార్టీని దేబిరించి ప్రాదేయ‌ప‌డ‌టం ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ‌లో సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి భార్య ప‌ద్మావ‌తి పోటీ చేస్తుంది. ఎలాగైనా ఈ స్థానాన్ని నిల‌బెట్టుకోవాల‌ని కాంగ్రెస్ స‌క‌ల విధాల పోరాడుతుంది.


అయితే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ, జ‌న‌సేన‌, టీజేఎస్‌, తెలంగాణ ఇంటిపార్టీ పొత్తులో పోటీ చేసింది. బోటాబోటిగా కేవ‌లం ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించే స్థాయికి సీట్లు గెలిచింది కానీ గెలిచినోళ్ళంతా వ‌ల‌స‌బాట ప‌ట్టారు. అయితే ఇప్పుడు హుజూర్‌న‌గ‌ర్ అసెంబ్లీకి ఉత్త‌మ్ రాజీనామా చేయ‌డంతో ఉప పోరు త‌ప్ప‌లేదు. అయితే ఈ ఉప‌పోరులో టీ ఆర్ ఎస్ గెలిచి పీసీసీ అధ్య‌క్షుడికి షాక్ ఇవ్వాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టుద‌ల‌తో ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద‌లు మాత్రం జ‌న‌సేన పార్టీ మ‌ద్ద‌తు కోసం జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంకు వెళ్లి పార్టీ తెలంగాణ ఇన్‌చార్జీ శంక‌ర్‌గౌడ్‌, పోలీట్‌బ్యూరో మెంబ‌ర్ అర్హంఖాన్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి పి.హ‌రిప్ర‌సాద్‌ల‌ను క‌లిసారు.


జ‌న‌సేన నేత‌ల‌ను క‌లిసిన‌వారిలో మాజీ ఎంపీ వి.హ‌న్మంత‌రావుతో నాయ‌కులు ఉన్నారు. జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చ‌ర్చించి కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చేలా కృషి చేయాల‌ని కోరారు. ఏదేమైనా అస‌లే గ‌తిలేక జ‌న‌సేన దుకాణం స‌ర్ధుకుంటుంటే ఇప్పుడు కాంగ్రెస్ మ‌ద్ద‌తు కోర‌డం విడ్డూర‌మే మ‌రి. దీనికి తోడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు న‌మ్మిన‌బంటుగా ప్ర‌చారం సాగుతుంది. కాంగ్రెస్‌కు పవ‌న్ మ‌ద్దతు ఇవ్వ‌డం అనుమానంగానే ఉంది.. సో కాలం కోసం ఎదురు చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: