ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎప్పుడు ఏది ఎలా చేయాలో బాగా అర్ధమైనట్లుంది. ఈ నాలుగు నెలల పరిపాలన కాలంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల ప్రజల్లో మంచి స్పందన రాగా, కొన్ని నిర్ణయాల పట్ల వ్యతిరేకిత వచ్చింది. అయితే ఆ వ్యతిరేకితని కూడా నిదానంగా తగ్గించుకునేందుకు తాను తీసుకున్న నిర్ణయాలని జనాలకు పాజిటివ్ మార్గంలో అర్ధమయ్యేలా చేస్తున్నారు. జగన్ అధికారంలోకి రాగానే గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెబుతూ...పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళడం, ఇసుక తవ్వకాలు ఆపేయడం, అన్నా క్యాంటీన్లు మూసివేయడం, అమరావతి నిర్మాణ పనులు ఆపేయడం చేశారు.


అయితే ఈ నిర్ణయాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో పాటు ప్రజల కూడా కొంత వ్యతిరేకిత వచ్చింది. కానీ జగన్ ఆ నిర్ణయాలని మళ్ళీ పారదర్శకంగా అమలు చేస్తారనే తెలియక ప్రజల్లో వ్యతిరేకిత వచ్చింది. ఇక ఎప్పుడు అయితే జగన్ తిరిగి వాటిని అమలు చేయడం మొదలుపెట్టారో అప్పుడు...జనాల్లో ఉన్న నెగటివ్‌ పోవడం మొదలైంది.  మొదట రివర్స్ టెండరింగ్ కి వెళ్ళి అందులో వందల కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారు. అది ప్రజలకు పూర్తిగా అర్ధమైంది.


అదేవిధంగా మొదట్లో ఇసుక దొరకక ఇబ్బందులు పడ్డ...తరవాత తక్కువ ధరకే ఇసుక కొత్త పాలసీని రూపొందించి ప్రజలకు ఇసుక అందించడం మొదలుపెట్టారు. పైగా ఇసుక కాంట్రాక్టులని నిరుద్యోగులకు ఇస్తానని ప్రకటించి మంచి నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల జిల్లాకి 2వేల మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. అలాగే అన్నా క్యాంటీన్ల నిలిపివేయడం వల్ల పేద ప్రజల్లో కొంత వ్యతిరేకిత వచ్చింది. దాన్ని కూడా పోగొట్టేందుకు జగన్ త్వరలోనే క్యాంటీన్లని ప్రారంభించడానికి చుస్తున్నారు. అది కూడా పేద ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేలా ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద రాజన్న క్యాంటీన్లని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


వచ్చే ఏడాది జనవరి 1న లేదా సంక్రాంతి పండుగ నాటికి రాజన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నిధుల కొరత వల్ల అమరావతి నిర్మాణం చేపట్టలేకపోతున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే ప్రభుత్వానికి అవసరమైన మేర రాజధాని నిర్మాణం జరగనుంది. ఈ విధంగా జగన్ నెగిటివ్ అంశాలని పాజిటివ్ గా మార్చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: