40 ఏండ్ల రాజ‌కీయ అనుభ‌వం.. మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా, మూడు సార్లు ప్ర‌తిప‌క్ష నాయకుడిగా ప‌నిచేసిన అపార అనుభ‌వ‌శాలి.. ప్ర‌పంచ‌దేశాల అధినేత‌లంతా నాకు తెలుసు అనే ధీమా... అభివృద్ధి చేయాల‌న్నా అది నా పేటేంట్ అని విర్ర‌వీగే నైజం అయ‌న సొంతం. చారిత్రాత్మ‌క‌మైన హైద‌రాబాద్ ను నేనే అభివృద్ధి చేశాన‌ని చెప్పుకునేందుకు వెనుకాడ‌ని త‌త్వం. పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీల‌కు తానే స‌ల‌హాదారుడిని అంటూ త‌న‌కు తాను గొప్ప‌లు చెప్పుకోవ‌డంలో ఆయ‌న ఘ‌నాపాటి. అయితే ఇప్పుడు అంత పెద్ద ధీరుడిగా, వీరుడిగా, రాజ‌కీయ దురంధ‌రుడిగా గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబు నాయుడుకు ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఎలా ఎదుర్కోవాలో అంతు చిక్క‌డం లేద‌ట‌.  


దివంగ‌త‌ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా రెండుసార్లు ప‌నిచేసి, మూడోసారి ముచ్చ‌ట‌గా వైఎస్  కొడుకు ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్ పాల‌నలో కూడా ప్ర‌తిప‌క్ష నేత‌గా ముచ్చ‌ట‌గా మూడోసారి ప‌నిచేస్తున్నారు. అయితే తండ్రి కొడుకుల చేతిలో ఘోరంగా ఓడిపోయి ప్ర‌తిపక్ష నేత‌గా ప‌నిచేస్తున్న చంద్రబాబు కు వైఎస్ ఆర్ తో పోటాపోటీగా పోరు చేసి ప్ర‌తిప‌క్ష నేత‌గా గ‌ట్టిపిండంగా నిరూపించుకున్నారు. కానీ ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌ను మాత్రం దీటుగా ఎదుర్కోలేక జుట్టుపీక్కుంటాడు. త‌న కొడుకు వ‌య‌సంత‌వాడు జ‌గ‌న్‌. అయితే క‌నీసం మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం లేదు.. కేవ‌లం ఒక‌సారి ఎంపీగా, ఒక‌సారి ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌నిచేసి ముచ్చ‌ట‌గా మూడో గెలుపుతోనే సీఎంగా పీఠ‌మెక్కారు.


ఎలాంటి అనుభ‌వం లేకుండా సీఎం జ‌గ‌న్ పాల‌న ప‌గ్గాలు చేబూని ప‌రిపాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారంటే ఎందుకో చంద్రాలుకు దిక్కుతోచ‌డం లేదట‌. అందుకే జ‌గ‌న్ చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో చంద్రాలుకు దిమ్మ‌తిరిగిపోతుంద‌ట‌.. సీఎం జ‌గ‌న్ ఆలోచ‌నాతీరు.. ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాలు, వాటిని అమ‌లు చేసే దైర్యం, వినూత్న ఆలోచ‌న‌లు, గ‌త పాల‌న పై స‌మీక్ష‌ల‌తో చంద్రాల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో సీఎం జ‌గ‌న్‌ను ఎదుర్కోనే స‌త్తా లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న చంద్రాలు ఇప్పుడు దిక్కులేని ప‌రిస్థితిలో జ‌న‌సేన‌, బీజేపీ నేత‌ల‌కు గాలం వేశాడ‌ట‌.


జ‌గ‌న్‌ను ఎదుర్కోవాలంటే ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒక్కటి కావాల‌ని, ప్ర‌భుత్వ వైఫ‌ల్యంపై ఉద్య‌మించాల‌ని గుంట‌న‌క్క ప్ర‌తిపాద‌న‌లు పెడుతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే జ‌న‌సేన, బీజేపీలతో చంద్రాలు చెలిమి చేసి అవ‌స‌రం తీరాక క‌సితీరా త‌న్నిత‌రిమాడు జ‌న‌సేన‌, బీజేపీ నేత‌ల‌ను. అయితే ఇప్పుడు కేవ‌లం త‌న‌కు మైలేజ్ కోసం ఏపీలో ఇప్పుడిప్పుడే సొంత బ‌లం పెంచుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా, టీడీపీతో జ‌త క‌ట్టిస్తే మ‌రోమారు బీజేపీని ఏపీలో ఎదుగ‌కుండా చేయోచ్చ‌నే కుటిల ప‌న్నాగంతో స‌ర్కారుపై పోరు పేరుతో ఒక్క‌ట‌వుదామ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌.


ఇక జ‌న‌సేన నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కూడా దువ్వితే ఆయ‌న భోళా శంక‌రుడు.. రాజ‌కీయ ప‌రిజ్ఞానం లేనోడు.. అందుకే తాను ఏదీ చెపితే అదే వింటాడ‌నే భ్ర‌మ‌తో ప‌వ‌నాల‌కు గాలం వేశాడ‌ట‌. అంటే అటు బీజేపీ, ఇటు జ‌న‌సేన బ‌లోపేతం కాకుండా, స‌ర్కారుపై ఉద్య‌మిస్తే త‌న‌కే మైలేజ్ తెచ్చుకుని మ‌రోమారు అధికారంలోకి రావొచ్చ‌నే కుట్ర‌పూరిత ఎత్తుగ‌డ‌కు తెర‌లేపాడ‌ట చంద్రాలు.. అందుకే రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తోనే పావులు క‌దుపుతూ.. త‌న నమ్మిన‌బంటుల‌ను బీజేపీలోకి పంపాడ‌నే ఆరోప‌ణ‌ల‌కు ఇప్పుడు బీజేపీ, జ‌న‌సేన, టీడీపీ ఒక్క‌టైతే రాజకీయ విమ‌ర్శ‌లు నిజ‌మే అవుతాయి... సో వేయిట్ అండ్ సీ...!


మరింత సమాచారం తెలుసుకోండి: