ఈ ట్విట్ట‌ర్ పిట్ట‌కు జ‌యంతికి వ‌ర్థంతికి తేడా తెలువ‌దు.. వేదికెక్కి మైక్ అందుకుంటే ఎవ్వ‌రి తిట్టాలో..ఎవ్వ‌రిని పొగ‌డాలో తెలువ‌దు.. గాలిక‌బుర్లు మాత్రం బాగానే చెప్పుతాడు.. న‌త్తి న‌త్తి నెత్తి ప‌లుగ‌గొట్టింద‌నే సామేత ప్ర‌కారం ఈ ట్విట్ట‌ర్ పిట్ట త‌న మాట‌ల‌తో సొంత‌పార్టీనే ఓడించండి అని ఉప‌న్యాసం ఇచ్చిన ఘ‌నాపాటి.. అలాంటి ట్విట్ట‌ర్ పిట్ట‌కు ఎన్నిక‌ల్లో గెలువ‌లేకున్న ఏతుల ఎంక‌టి గాని లెక్క ఓ ఫోజులు కొడుతుండు... ఓ ట్విట్ట‌ర్ దొర‌క‌బ‌ట్టుకుని ఎవ్వ‌రో ఘోస్ట్ రైట‌ర్ చెప్పిన నాలుగు ముక్కుల ట్విట్ చేస్తూ ప‌బ్బం గడుపుకుంటుండు..


ఇంత‌కు అయితే అమ్మ పెట్ట‌దు.. అడుక్కోనివ్వ‌దు అనే సామేత లెక్క ఈ ట్విట్ట‌ర్ పిట్ట అధికారంలో ఉన్న‌ప్పుడు వారి తాబేదార్ల‌కు వంద‌లు, వేల కోట్లు దోచి పెట్టారు కాని పేద బ‌తుకుల‌కు ఇంత గంజిమెతుకుల కోసం సాయంచేసిన పాపాన పోలేదు. ఆటో కార్మికులు రోడ్డుకు అడ్డ‌దిడ్డంగా పోతున్నార‌ని ఫైన్లు వేసింది ఈ ట్విట్ట‌ర్ పిట్ట స‌ర్కారు.. లైసెన్స్ లేద‌ని, క‌నీసం కాకి అంగి తొడ‌గ‌లేద‌ని, ఆటోలో కెపాసిటి క‌న్నా ఎక్కువ మందిని ఎక్కించుకున్నావ‌ని ఈ ట్విట్ట‌ర్ పిట్ట స‌ర్కారోల్లు వేల రూపాయలు ఫైన్లు వేసి ఆటో డ్రైవ‌ర్ల‌ను, క్యాబ్ డ్రైవ‌ర్ల‌ను నానాయాత‌న కు గురి చేసి ఇప్పుడు త‌గుదున‌మ్మా అంటూ మొస‌లి క‌న్నీరు కార్చుతున్నారు.


ఇదేమీ చోద్యమో కానీ త‌న పాల‌న‌లో వాహ‌నాల  డ్రైవ‌ర్ల ఉసురుపోసుకున్న అప్ప‌టి స‌ర్కారుకు ఇప్పుడు సిఎం జ‌గ‌న్ స‌ర్కారు తేడా ఏమీ క‌న‌ప‌డ‌లేన‌ట్లుగా న‌టిస్తున్నారు ఈ ట్విట్ట‌ర్ పిట్ట‌గాడు.. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు ఆటో డ్రైవ‌ర్ల‌కు, క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు సాయం చేస్తుంటే స‌పోర్టు చేయాల్సింది పోయి.. ఇదేమీ స‌ర్కారు.. అని అడ్డ‌దిడ్డంగా మాట్లాడి ఓ పిట్ట‌ల దొర‌ను త‌ల‌పిస్తున్నాడు ఈ ట్విట్ట‌ర్ పిట్ట లోకేషాలు.. ఈ లోకేషాలు అడ్డ‌దిడ్డ‌మైన వేశాలు ఎప్పుడు మారుతాడో ఏమో గాని ఇప్పుడు ఏపీ స‌ర్కారు ఏడాదికి ఆటో డ్రైవ‌ర్ల‌కు రూ.10వేల సాయం చేస్తుంటే... పాపం లోకేషాలుకు క‌డుపు మంట‌గా ఉన్నట్టుంది.


ఆటో డ్రైవ‌ర్లకు ఎందుకు ఈ సాయం చేస్తున్నారు.. మాకు క‌డుపు మంట‌గా ఉంది అని నేరుగా అన‌లేక‌.. లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తూ లోకేషాలు లేకీ వేశాలు వేస్తున్నాడు.. ఇక‌నైనా లోకేషాలు అండ్ బ్యాచ్ సాయం చేయ‌క‌పోయినా ప‌ర్వాలేదు గానీ సాయం చేసే చేతుల‌ను న‌రుకాల‌ని చూస్తే వారికి ఏ గ‌తి ప‌డుతుందో 2019 ఎన్నిక‌ల్లో జ‌రిగిన గుణ‌పాఠం త‌ప్ప‌దు.. చివ‌రిగా చెప్పోచ్చెదేమంటే.. లోకేషాలు కొద్ది సేప‌టి క్రితం ఓ ట్విట్ట‌ర్ లో ఈ క్రింది విధంగా ట్విట్ చేశాడు..


వైఎస్సార్ వాహన కక్ష పథకం చూసి ఆటో డ్రైవర్లు భయపడుతున్నారు. జ‌గ‌న్‌ గారూ. మీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు, అడుగుతున్న సర్టిఫికెట్ల కోసం తిరిగే డబ్బుతో కొత్త ఆటో కొనుక్కోవచ్చట. రాష్ట్రంలో సుమారుగా 6.63 లక్షల మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు అని ఒక లెక్క. మ్యానిఫెస్టోలో చెప్పని నిబంధనలన్నీ పథకం అమలు చేసేటప్పుడు ఎందుకు పుట్టుకొస్తాయి జగన్ గారూ? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? లేక మోసం చెయ్యడం మీకు కొత్త కాదు కాబట్టి, ఇప్పుడు కూడా అలాగే చేసాం అంటారా? సమాధానం చెప్పండి అంటూ ఓ ట్విట్ ట్విట్టాడు.. ఇది చూస్తే తెలుస్తుంది.. ఎవ్వ‌రిని ఎవ్వ‌రు మోసం చేశారు.. ఎవ్వ‌రు ఎవ్వ‌రిని మోసం చేస్తున్నారు అని.. ఇక‌నైనా మేలుకోక‌పోతే లోకేషాలుకు వేషాలు వేసుకుని బ‌తికే రోజు రాక త‌ప్ప‌దు..


మరింత సమాచారం తెలుసుకోండి: