తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి నుంబర్లను డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఈ విధానాన్ని అధ్యయనం చేసేందుకు మున్సిపల్‌ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌  ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ హైదరాబాద్‌లో క్యూఆర్‌ కోడ్‌ బేస్డ్‌ డిజిటల్‌నెంబర్‌ విధానాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల రోడ్‌మ్యాప్‌ తయారీకి డిజిటల్‌డోర్‌నెంబర్‌ఉపయోగపడుతుందన్నారు.
అలాగే హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్దిపనులు, పారిశుద్ధ్యం పనులు ఏక కాలంలో పర్యవేక్షణ చేసేందుకు కూడా ఉపయోగ పడుతుందని అరవింద్‌కుమార్‌తెలిపారు. ఢిల్లీ, బెంగళూరు, విజయవాడ నగరాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న డిజిటల్‌ డోర్‌ నెంబరింగ్‌ విధానం అమలు తీరును కమిటీ పరిశీలిస్తుందని అరవింద్‌కుమార్‌ తెలిపారు.


డిజిటల్‌డోర్‌నెంబర్‌ అమలు విధానంలో లాభనష్టాలను కూడా కమిటీ పరిశీలిస్తుందన్నారు. డిజిటల్‌ డోర్‌నెంబర్‌ విధానం వల్ల ఆస్తిపన్నువసూలుకు, టౌన్‌ప్లానింగ్‌, పారిశుద్ద్య నిర్వహణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పూర్తిసమాచారాన్ని క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసు కునేందుకు అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్ తో  పాటు రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ డోర్‌నెంబర్‌ మొదటి దశలో గ్రేటర్‌హైదరాబాద్‌లో అమలు  చేయనున్నారు.  మలి దశలో ఉన్నత స్థాయి కమిటీ కన్వీనర్‌గా జీహెచ్‌ఎంసి కమిషనర్‌లోకేష్‌కుమార్‌, మెంబర్‌కన్వీనర్‌గా డైరెక్టర్‌ ఆప్‌ మున్పిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ టికె త్రివేది,



టీఎస్‌టిఎస్‌ డైరెక్టర్‌ జిటి వెంకటేశ్వర్‌, జీహెచ్‌ఎంసి అడిషనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ ఫారూఖీ, చీఫ్‌సిటీప్లానర్‌దేవేందర్‌రెడ్డి, డైరెక్టర్‌ ప్లానింగ్‌ కె. శ్రీనివాస్‌రావు, ఎంఎయుడి డైరెక్టర్‌ప్లానింగ్‌ బాలకృష్ణ, ఓయూ ప్రొఫెసర్‌ పివిసుధ, ఆస్కి టెక్నాలజీ అడ్వయిజర్‌ సుబ్రహ్మణ్యం యడవల్లి, హెచ్‌ఎండి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.హరినాధ్‌రెడ్డి, ఎన్‌ఐయుఎం సీనియర్‌ నాలెడ్జ్‌ మేనేజర్‌ డి.గౌతమి ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ ఈనెల 30వ తేదీలోపు డిజిటల్‌డోర్‌నెంబర్‌విధానం అమలుపై నివేదిక ఇవ్వనుంది. దీనితో  గ్రేటర్‌ పరిధిలో అస్తవ్యస్ధంగా ఉన్న ఇంటినెంబర్లకు చెక్‌పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే డిజిటల్‌నెంబర్‌ విధానాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: