ఎన్టీయార్  బంపర్ మెజారిటీతో 1995లో గెలిచారు. ఆయన్ని ఎనిమిది నెలల్లో దించేశారు. దీని వెనక కీలకమైన పాత్ర పోషించింది  ఒక సెక్షన్ మీడియా అన్నది అందరికీ తెలిసిందే. ఒక వర్గం మీడియా ఎన్టీయార్ వద్ద  ఉన్న ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఆయన్ని కించపరచేలా రాతలు రాయడం, లక్ష్మీపార్వతి జోక్యం ఉందని చెప్పడం ద్వారా పదే పదే మెదళ్ళకు ఎక్కించింది. తాము అనుకున్న లక్ష్యం కోసం ఇది భారీ ఆపరేషన్ లా జరిపించింది. ఆ తరువాత ఎన్టీయార్ని గద్దె దింపేటపుడు కూడా ఆయన వద్ద మెజారిటీ ఎమ్మెల్యేలు ఉంటే ప్రత్యర్ధి శిబిరంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి గందరగోళం స్రుష్టించింది.


చివరికి అన్న గారు మెజారిటీ ఉండి కూడా ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవాల్సివచ్చింది. ఇది జరిగి పాతికేళ్ళు అవుతోంది. ఇపుడు మళ్ళీ అలాంటి ఆపరేషన్ చేయడానికి ఒక వర్గం మీడియా సిధ్ధపడుతోందా అన్న అనుమానాలు అందరికీ కలుగుతుననయి. జగన్ మీద తెల్లారిలేస్తే పూనకం వచ్చేట్టుగా రాతలు రాసి వండివారుస్తున్న ఎల్లో మీడియా సరైన సమయం కోసం  ఎదురుచూస్తోందంటున్నారు.


ఓ తలపండిన మీడియాధిపతి కేంద్రమంత్రి ఒకరి వద్ద జగన్ సర్కార్ పై తన గోడు వెళ్లబోసుకుని అక్కసు వెళ్లగక్కడమే దీనికి నిదర్శంగా భావిస్తున్నారు. జగన్ని ఏపీలో మా నెత్తిన ఎక్కించారు అంటూ సదరు కాకలు తీరిన మీడియాధిపతి తీవ్ర ఆక్రోశం వెళ్ళగక్కడం వెనక వైసీపీ సర్కార్ ఏపీలో ఏర్పడడాన్ని ఎంతలా జీర్ణించుకోలేకపోతున్నారో అర్ధం చేసుకోవాలంటున్నారు. బీజేపీ సహకారంతోనే జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చారన్న స్వరంతో ఆయన ఆ కేంద్ర ఎంపీ వద్ద వ్యాఖ్యానించినట్లుగా అర్ధమవుతోంది. 


సదరు మీడియాధిపతి నాడు వైఎస్సార్ కి, నేడు జగన్ కి కూడా వ్యతిరేకంగా వార్తలు వండివార్చడంతో ఘనాపాఠిగా పేరు గడించాడు. టీడీపీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్న ఆయనకు తాజా ఎన్నికల ఫలితాలు మింగుడుపడడంలేదని అంటున్నారు. మరి ఆయన తన చేతిలో ఉన్న బలమైన మీడియాతో జనం అభిప్రాయాన్ని మార్చేందుకు అపుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరో వైపు వైసీపీలో కూడా అసంత్రుప్తి రాజేసేందుకు కూడా మీడియా ఆపరేషన్ మొదలైందని అంటున్నారు.


సరిగ్గా ఇలాంటివి వూహించే ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు జగన్ని హెచ్చరించినట్లుగా చెబుతున్నారు. మరి  జగన్ ఎన్టీయార్ అవుతారా, లేక అర్జునుడిగా ఈ మీడియా కుట్రలు ఛేదించి బయటకు వస్తారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: